Kalpana Soren : నామినేషన్ వేసిన మాజీ సీఎం భార్య.. బైపోల్‌లో గెలిస్తే సీఎం పోస్టు ?

Kalpana Soren :  జార్ఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటరయ్యారు.

  • Written By:
  • Updated On - April 29, 2024 / 03:22 PM IST

Kalpana Soren :  జార్ఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. ఆమె ఉప ఎన్నిక జరగనున్న గాండే అసెంబ్లీ స్థానం నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కల్పన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ముఖ్యమంత్రి చంపై సోరెన్, పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. ఈ స్థానంలో మే 20న ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా దిలీప్ వర్మ పోటీ చేస్తున్నారు. నామినేషన్‌కు ముందు కల్పన తన అత్తామామల ఆశీర్వాదాలు తీసుకున్నారు.దానికి సంబంధించిన ఓ ఫొటోను ఆమె(Kalpana Soren) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read :CM Revanth : రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్‌‌కే ఓటు వేయండి : సీఎం రేవంత్