Site icon HashtagU Telugu

Jayaho Kargil : జూలై 26 కార్గిల్ విజయ్ దివస్.. నాటి సైనికుల పోరాట స్ఫూర్తి నేటికీ చిరస్మరణీయం

Kargil Vijay Diwas

Kargil Vijay Diwas

Kargil Vijay Diwas : 1999, జూలై 26 (July 26th) న భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని (జులై 26) జరుపుకుంటున్నాము. కార్గిల్ యుద్ధం (Kargil War)లో దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఈరోజును అంకితం చేస్తుంటాం. దొడ్డిదారిన భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ట్రై చేసిన పాక్ సైనికులకు భారత ఆర్మీ తమ బలాన్ని చూపించి వణుకు పుట్టించింది. ‘ఆపరేషన్ విజయ్’ తో కార్గిల్ నుండి పాకిస్తాన్ చొరబాటుదారులపై యుద్ధ భేరీ మోగించింది. పాక్ సైనికులపై మన సైన్యం విరుచుకుపడి దేశం నుంచి దాయాది సైనికులను తరిమికొట్టారు.

అసలు జరిగిందేంటి?

1999 ఫిబ్రవరిలో భారత్ పాకిస్తాన్ (Bharat & Pakistan) దేశాలమధ్య ఒప్పందం కుదిరింది. కానీ, కాశ్మీర్ ను ఆక్రమించుకోవాలన్ని కుట్రతో పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ బదర్ అనే పేరిట ఉగ్రవాదులను భారత సరిహద్దుల్లోకి పంపించింది. అప్పటి భారత ప్రభుత్వం యుద్ధం చేయకుండ ఉండేందుకు ప్రయత్నించింది. అయినా, పాకిస్తాన్ తన నిర్ణయం మార్చుకోకపోవడంతో యుద్ధానికి వెళ్ళక తప్పలేదు.

1999, మే 3న కార్గిల్ (Kargil) జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం మొదలైంది. దీనిని భారత సైన్యం ఆపరేషన్ విజయ్ అనే కోడ్ నేమ్ ను పెట్టుకుంది. అంతటి చలిలో, మంచు పర్వతాల్లో దాదాపు 60 రోజులపాటూ ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇరుదేశాల సైనికులు ఎంతోమంది మరణించారు. భారత సైనికులు దాదాపు 527 మంది అమరులయ్యారు.

చివరికి జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి, భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించింది. అందువల్ల ప్రతిఏటా జూలై 26 కార్గిల్ విజయ దినోత్సవం (Kargil Vijay Diwas) జరుపబడుతుంది.

యుద్ధం ఏ రోజు ఎలా జరిగిందంటే..!

కార్గిల్ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) మన దేశానికి గర్వకారణమైన రోజు..

కార్గిల్ విజయ్ దివస్ ప్రతి సంవత్సరం జూలై 26 న దేశాన్ని రక్షించడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన భారత సైన్యానికి చెందిన ధైర్యవంతులైన వీరులను స్మరించుకోవడానికి గుర్తించబడింది. కార్గిల్ విజయ్ దివస్ కాశ్మీర్ లో పాకిస్తాన్ చొరబాటుదారులు తీసుకున్న వివిధ పర్వత శిఖరాలను తిరిగి పొందడంలో మరణించిన వీరుల వీరోచిత త్యాగాలు మరియు ధైర్యసాహసాలను గౌరవిస్తుంది.

దీనిని రాజకీయ నాయకులు, అధికారులు మరియు పౌరులందరూ దేశవ్యాప్తంగా ప్రశంసిస్తారు. కార్గిల్ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) మన దేశానికి గర్వకారణమైన రోజు, ఎందుకంటే ఈ రోజు పాకిస్తాన్ పై మనము గణనీయమైన విజయాన్ని సాధించాం కాబట్టి.

భారత సైన్యం అంటే వణుకు పుట్టాల్సిందే..

కార్గిల్ యుద్ధం తన సైన్యం భారతదేశానికి వ్యతిరేకంగా ఇటువంటి దుస్సాహసాలకు పాల్పడితే తనకు ఎటువంటి అంతర్జాతీయ మద్దతు లభించదని పాకిస్తాన్ గ్రహించేలా చేసింది. పాకిస్తాన్ సాయుధ దళాలు కూడా భారతదేశం యొక్క బలాన్ని మరియు క్షేత్రస్థాయిలో మన ధైర్యవంతులైన సైనికుల శక్తిని కూడా గ్రహించాయి.

భారతదేశం విషయానికి వస్తే, కార్గిల్ యుద్ధం భారతదేశం సంవత్సరాలుగా ప్రపంచానికి ఏమి చెబుతుందో నిరూపించింది – పాకిస్తాన్ అస్థిర స్థితిలో ఉంది మరియు దాని సైన్యం దాని బరువుకు మించి పంచ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ యుద్ధం ప్రపంచంలో భారతదేశం యొక్క నిజమైన బలాన్ని కూడా గ్రహించింది.

అందుకే కార్గిల్ విజయ దినోత్సవం (Kargil Vijay Diwas) సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు, కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజలంతా వాటిలో పాల్గొని సైనికులకు వందనాలు అర్పిస్తారు.

Read Also :  TS High Court: హైకోర్టు సంచలన తీర్పు, కొత్తగూడెం ఎమ్మెల్యే పై అనర్హత వేటు