Sita Soren : బీజేపీలోకి హేమంత్‌ సోరెన్‌ వదిన.. ఎందుకో తెలుసా ?

Sita Soren : లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.

  • Written By:
  • Publish Date - March 19, 2024 / 05:06 PM IST

Sita Soren : లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా మంగళవారం జార్ఖండ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ చీఫ్, మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ వదిన సీతా సోరెన్‌ బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే, పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి లక్ష్మీకాంత్‌ బాజ్‌పాయ్‌ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు.

We’re now on WhatsApp. Click to Join

కమలదళంలో చేరడానికి కొన్ని గంటల ముందు జేఎంఎం పార్టీలోని అన్ని ప‌ద‌వుల‌కు సీతా సోరెన్(Sita Soren) రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తన మామ, జేఎంఎం వ్యవస్థాపక అధ్యక్షుడు శిబు సోరెన్‌కు పంపించారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. శిబు సోరెన్ పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ భార్య సీతా సోరెన్. 2009 లో 39 ఏళ్ల వ‌య‌సులో దుర్గా సోరెన్ మ‌ర‌ణించారు. అయితే తన భ‌ర్త చనిపోయిన తర్వాత త‌నను, తన కుటుంబాన్ని అగౌర‌వ‌ప‌రిచే విధంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని రాజీనామా లేఖ‌లో సీతా సోరెన్ ఆవేద‌న వ్యక్తం చేశారు. పార్టీ స‌భ్యులు, కుటుంబం త‌మ‌ను వేరు చేసే విధంగా వ్యవ‌హ‌రించ‌డం త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌ని.. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సీతా సోరెన్ పేర్కొన్నారు.‘‘జేఎంఎంలో నాకు తగిన ప్రయారిటీ లభించడం లేదు.  ఆ పార్టీలో నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏకాకిని చేశారు’’ అని సీతా సోరెన్ ఆరోపించారు. దుమ్కా జిల్లాలోని జామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీతా సోరెన్‌ చేరికతో రాష్ట్రంలోని ఎస్టీ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపేందుకు అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం జార్ఖండ్‌లో జేఎంఎం పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఎస్టీ ఓటర్లే ఉన్నారు.

Also Read :India Vs China : అరుణాచల్‌పై వట్టి మాటలు కట్టిపెట్టండి.. చైనాకు భారత్ హితవు

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన అప్పటి జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్ స్థానంలో ఆయన సతీమణి కల్పనా సోరెన్‌కు సీఎం పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం రెండు నెలల క్రితం జరిగింది. అయితే అప్పట్లో ఈ ప్రతిపాదనను సీతా సోరెన్ బహిరంగంగానే వ్యతిరేకించడం సంచలనం క్రియేట్ చేసింది. సీతా సోరెన్ వ్యతిరేకత వల్లే ఆనాడు కల్పనా సోరెన్‌ను జార్ఖండ్ సీఎం చేయలేదని తెలిసింది. ఒకవేళ సీతా సోరెన్ మాటను కాదంటే.. జేఎంఎంలో తిరుగుబాటు జరుగుతుందనే ఆందోళనకు హేమంత్ సోరెన్ అప్పట్లో లోనయ్యారని చెబుతున్నారు.హేమంత్ సోరెన్‌ను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత జార్ఖండ్ సీఎంగా తాను పీఠంపై కూర్చోవాలని సీతా సోరెన్ చాలా ప్రయత్నాలు చేశారు. అయితే అవేమీ పారకుండా శిబు సోరెన్‌కు అత్యంత సన్నిహితుడు, సీనియర్ జేఎంఎం నేత చంపై సోరెన్.. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో కుటుంబంతోపాటు గత కొంత కాలంగా జేఎంఎం పార్టీలో సీతా సోరెన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Also Read :Etela Rajender : రేవంత్ సర్కార్ ను నీటి బుడగతో పోల్చిన ఈటెల