Kashmir Statehood : జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సీఎం ఒమర్ అబ్దుల్లా సారథ్యంలోని మంత్రి మండలి చేసిన తీర్మానంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ తీర్మానానికి తన తరఫున ఆమోదాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటించారు. కశ్మీరుకు రాష్ట్ర హోదా దక్కాలనేదే తన అభిమతమని ఆయన వెల్లడించారు. ఈవిషయంలో కశ్మీర్ మంత్రి మండలి చేసిన తీర్మానానికి మనోజ్ సిన్హా(Kashmir Statehood) మద్దతు ప్రకటించారు.
Also Read :Vikash Yadav : ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్రకేసు.. ‘రా’ మాజీ అధికారి వికాస్ అరెస్టు !
ఈవివరాలను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయ అధికార వర్గాలు ధ్రువీకరించాయి. రాష్ట్రహోదాను సాధించేందుకు కొత్త ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ నిర్ణయం మరింత దోహదం చేస్తుందని వెల్లడించాయి. ఈ తీర్మానాలను త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు. రాష్ట్ర హోదా కావాలనే జమ్మూకశ్మీరు ప్రజల డిమాండ్ నెెెరవేరేందుకు మార్గం మరింత సుగమం అయిందని చెప్పారు. నూతన ప్రభుత్వం జమ్మూకశ్మీరులోని అన్ని వర్గాల ప్రజల రాజ్యాంగ హక్కులను తప్పకుండా పరిరక్షిస్తుందనే ఆశాభావాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వ్యక్తం చేశారని అధికార వర్గాలు తెలిపాయి.
Also Read :Dhana Trayodashi : 29న ధన త్రయోదశి.. ఆ రోజు యమదీపం వెలిగించడం వెనుక పురాణగాథ ఇదీ
త్వరలోనే సీఎం ఒమర్ అబ్దుల్లా న్యూఢిల్లీలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పలువురితో ఒమర్ భేటీ అవుతారని తెలిసింది. జమ్మూకశ్మీరుకు ప్రత్యేక హోదాను సాధ్యమైనంత త్వరగా కేటాయించాలనే డిమాండ్‌ను ఒమర్ వినిపించనున్నారని సమాచారం. మరోవైపు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. నవంబరు 4 నుంచి అసెంబ్లీ సెషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈసెషన్‌ను ప్రారంభించి, ప్రసంగించాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఇప్పటికే ఆహ్వానాన్ని పంపింది.