Site icon HashtagU Telugu

Chidambaram : దేశంలో జమిలి ఎన్నికలు అసాధ్యం: చిదంబరం

Jamili elections are impossible in the country: Chidambaram

Jamili elections are impossible in the country: Chidambaram

Jamili elections are impossible in the country Chidambaram: ప్రస్తుతం ఎన్డీఏ పాలనలోనే జమిలి ఎన్నికల నిర్వహణ ప్రారంభమవుతుందన్న ప్రచారంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం మాట్లాడుతూ..ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని అన్నారు. అలా చేయాలనుకుంటే రాజ్యాంగానికి కనీసం ఐదు సవరణలు అయినా చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ రాజ్యాంగ సవరణలను ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు ఎన్డీయే సర్కారు వద్ద తగిన సంఖ్యాబలం లేదని తెలిపారు. ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ అనే విధానాన్ని ఇండియా కూటమి వ్యతిరేకిస్తుందని వెల్లడించారు.

Read Also: Inauguration Of Rajiv Gandhi Statue : రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

రిజర్వేషన్లను రద్దు చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోందని ఇటీవల ప్రధాని మోడీ అన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ మేము ఎన్నో ఏళ్లుగా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాము. వాటిని రద్దు చేయాలని ఎందుకు కోరుకుంటాం?50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగించాలని మేం చెబుతున్నాం..జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్‌ చేస్తున్నాం” అని పేర్కొన్నారు.

అక్టోబర్ 5న జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ”ఎన్నికలు జరిగిన అనంతరం ఎమ్మెల్యేల ఇష్టాయిష్టాలను తెలుసుకున్నాక సీఎం ఎవరనేది హైకమాండ్‌ ప్రకటిస్తుంది. అదే పద్ధతి. హరియాణాలోనూ అదే విధానాన్ని కొనసాగిస్తాం” అని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని చిదంబరం ప్రజలను అభ్యర్థించారు. హరియాణాలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తామని, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Read Also: Aditi Rao Hydari : పెళ్లి తర్వాత హీరోయిన్ అదితి పెట్టిన ఫస్ట్ పోస్ట్

గతనెల స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని మోడీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని, వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నుంచి బయట పడాలంటే జమిలి ఎన్నికలే పరిష్కారమని అన్నారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ 3.0 సర్కారులోనే జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read Also: BRS Protest Tomorrow : రేపు రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ ఆందోళనకు పిలుపు