Site icon HashtagU Telugu

Jalli Kattu : తమిళనాడులో ప్రారంభమైన జల్లికట్లు పోటీలు

Jallikattu competitions started in Tamil Nadu

Jallikattu competitions started in Tamil Nadu

Jalli Kattu : తమిళనాడులో ఈరోజు నుంచి జల్లి కట్టు పోటీలు ప్రారంభం కానున్నాయి. తమిళనాడులో పొంగల్‌ పండుగ సందర్భంగా ఏటా జనవరిలో జల్లికట్టు నిర్వహిస్తారు. పరుగెత్తే పశువులను పట్టుకుని నిలువరించేందుకు యువకులు ప్రయత్నిస్తారు. అలాగే గ్రౌండ్‌లో ఎద్దులను లొంగదీసుకుని వాటిపై ఆధిపత్యం చెలాయించేందుకు పోటీపడతారు. ఈ జల్లికట్టు అనేది తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే ఒక సంప్రదాయక క్రీడ.

తాజాగా పుదుక్కోట్టై జిల్లాలో జల్లికట్టు క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తచ్చన్‌కురిచి లో జరిగిన ఈ జల్లికట్టు క్రీడలో తిరుచ్చి, దిండిగల్‌, మనప్పరై, పుదుక్కోట్టై, శివగంగై జిల్లాల నుంచి దాదాపు 600కి పైగా ఎద్దులు పాల్గొన్నాయి. సుమారు 300 మందికిపైగా యువకులు ఎద్దులను నిలవరించేందుకు పోటీపడ్డారు. జల్లికట్టు పోటీలను వీక్షించేందుకు రాష్ఠ్రం నలుమూలల నుంచి ప్రజలు హాజరు కానున్నారు. ప్రభుత్వం అధికారికంగా ఈ జల్లికట్టు పోటీలను నిర్వహిస్తుంది. సంప్రదాయంగా భావిస్తుంది. పోటీల కోసం అధికారులు భారీ బందోబస్తును అక్కడ నిర్వహిస్తుంది. దీంతో పాటు గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించేందుకు అవసరమైన ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది.

కాగా, ఈ జల్లి కట్టు పోటీలు త‌మిళ‌నాడు రాష్ట్రంలో అనాదిగా వ‌స్తున్న ఆచారం. ప్రతి సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు ఉత్సవం జ‌రుపుకుంటారు. జనవరి నుంచి మే 31 మధ్య సాధారణంగా 120కిపైగా జల్లికట్టు ఈవెంట్‌లు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయ ఎద్దుల క్రీడలను చూసేందుకు తమిళనాడు వ్యాప్తంగానే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివస్తుంటారు. జ‌ల్లిక‌ట్టు అంటే ఎద్దుల‌ను, కోడెల‌ను బెద‌ర‌గొట్టి ఒక మార్గం గుండా గుంపులుగా వ‌దిలిపెడుతారు. గుంపులుగా ప‌రుగులు తీస్తున్న ఎద్దుల‌ను యువ‌కులు లొంగిదీసే ప్రయ‌త్నం చేస్తారు. అలా లొంగదీసిన వ్యక్తిని విజేతగా ప్రక‌టిస్తారు. ఇక..మదురై జిల్లాలోని అలంగనల్లూరు సమీపంలో నిర్మించిన జల్లికట్టు స్టేడియానికి రాష్ట్ర మాజీ సీఎం, దివంగత డీఎంకే అధినేత కరుణానిధి పేరు పెట్టారు.

Read Also: Seshachalam Forest : విహార యాత్ర కాస్త విషాదయాత్రగా మారింది