Site icon HashtagU Telugu

Jalebi Baba Raped 100 Women: వంద మంది మహిళలపై అత్యాచారం.. రేపిస్ట్ బాబా అరెస్ట్!

Baba

Baba

ఒకరు కాదు… ఇద్దరు కాదు.. ఏకంగా 100 మంది మహిళలపై అత్యాచారం (Rape) చేశాడో బాబా. అంతేకాదు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా తీశాడు. అక్కడితో ఆగిపోకుండా బ్లాక్ మెయిల్ చర్యలకు పాల్పడేవాడు. హర్యానాలోని ఫతేహాబాద్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అమర్‌పురి లేదా జలేబీ బాబా (Jalebi Baba) కు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తన వద్దకు వచ్చే మహిళలకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసేవాడు. వీడియోలను పబ్లిక్‌గా పెడతానని బెదిరించి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేసేవాడు.

ఈ రేపిస్ట్ బాబా (Jalebi Baba) వేధింపుల తట్టుకోలేక పలువురు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు అదనపు జిల్లా జడ్జి బల్వంత్ సింగ్ 63 ఏళ్ల అమర్‌పురి బాబాకు (పోస్కో) చట్టంలోని సెక్షన్ 6 కింద 14 సంవత్సరాల జైలు విధించారు. వీటితో పాటు మరిన్ని కేసులు బాబాపై పెట్టారు. శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయని, 14 ఏళ్ల పాటు కటకటాల వెనుకే ఉంటాడని బాధితుల తరపు న్యాయవాది సంజయ్ వర్మ తెలిపారు.

ఫతేహాబాద్ కోర్టు జనవరి 5న స్వయం దైవంగా ప్రకటించుకున్న అమర్‌వీర్‌ను (Jalebi Baba) అత్యాచారం ఆరోపణల కింద దోషిగా నిర్ధారించింది. న్యాయమూర్తి దోషిగా నిర్ధారించిన తర్వాత కోర్టు గదిలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. పలువురు మహిళల్లో ఆరుగురు బాధితులు బాధితులుగా కోర్టుకు హాజరయ్యారు. ముగ్గురు బాధితుల వాంగ్మూలాల ఆధారంగా కోర్టు తీర్పు వెలువరించింది.

Also Read: Titanic Re released: సినీ లవర్స్ కు గుడ్ న్యూస్..‘టైటానిక్’ మళ్లీ వచ్చేస్తోంది!