Jalebi Baba : 120 మంది మహిళలను అత్యాచారం చేసిన ”జిలేబీ బాబా” మృతి ..

తాను చేతబడులు తొలగిస్తానని, దుష్టశక్తుల పని పడతానని నమ్మబలికి ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం చేశాడు

Published By: HashtagU Telugu Desk
Jalebi Baba Dies

Jalebi Baba Dies

120 మంది మహిళలను అత్యాచారం (Raping ) చేసి జైలు పాలైన ‘జిలేబీ బాబా’ (Jalebi Baba)..ఆ జైల్లోనే కన్నుమూశాడు. దేశం రోజు రోజుకు ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ..ఇంకా ప్రజల్లో మూఢనమ్మకాలు అనేవి పోవడం లేదు. ఇంకా దొంగబాబా లను నమ్ముతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆలా కొంతమంది మహిళలు ‘జిలేబీ బాబా’ ను నమ్మి తమ శీలాన్ని వదులుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

జిలేబీ బాబా.. మహిళలు, బాలికలను ఆకర్షించేవాడు. తాను చేతబడులు తొలగిస్తానని, దుష్టశక్తుల పని పడతానని నమ్మబలికి ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం చేశాడు. పంజాబ్‌లోని మన్సా జిల్లాకు చెందిన బిల్లూ రామ్‌, 20 ఏళ్ల క్రితం జిలేబీలు అమ్ముకొని ఉపాధి పొందేందుకు హరియాణాలోని తోహ్నా వచ్చాడు. కొన్నాళ్లకు తాను క్షుద్ర పూజల ఆట కట్టిస్తానంటూ ప్రచారం చేసుకొని ఆశ్రమం తెరిచాడు. నమ్మి వచ్చిన మహిళలకు జిలేబీ బాబా మర్యాద పేరుతో మత్తుమందును కలిపిన చాయ్‌ని ఇచ్చి అత్యాచారం చేసేవాడు.

ఆలా ఒకరు కాదు ఇద్దరు దాదాపు 120 మందికి పైగా మహిళలను అత్యాచారం చేశారు. హరియాణాలోని హిస్సార్‌లో దాదాపు నాలుగేళ్ల క్రితం వెలుగుచూసిన ఈ దారుణానికి సంబంధించి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు జనవరిలో 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హర్యానాలోని హిసార్‌లోని సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. షుగర్ పెషెంట్ అయిన ఇతని ఆరోగ్యం మంగళవారం క్షీణించింది. రాత్రి సమయంలో ఒంట్లో ఇబ్బందికరంగా ఉందని చెప్పడంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను హార్ట్ ఎటాక్‌తో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం బుధవారం అతడి అంత్యక్రియల్ని నిర్వహించారు.

Read Also : Carrot Milk Shake : క్యారెట్ మిల్క్ షేక్.. పక్కా కొలతలతో ఇలా చేయండి..

  Last Updated: 09 May 2024, 09:28 PM IST