Site icon HashtagU Telugu

jaishankar : విదేశీ మీడియాలో భారత లోక్‌సభ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యకు జైశంకర్ కౌంటర్‌

Jaishankar counter on his comment on Indian Lok Sabha elections in foreign media

Jaishankar counter on his comment on Indian Lok Sabha elections in foreign media

jaishankar: మా అత్యల్ప ఓటింగ్ శాతం మీ కంటే ఎక్కువ అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (jaishankar)అన్నారు. విదేశీ మీడియాలో భారత లోక్‌సభ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యకు జైశంకర్ ఎదురుదాడికి దిగారు. వారి విమర్శలు “మా ఎన్నికలలో రాజకీయ ఆటగాళ్ళు” అనే తప్పుడు భావన నుండి వస్తున్నాయని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వేసవిలో ఎండలు మండిపోతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించాలన్న భారత్ నిర్ణయాన్ని ప్రశ్నించిన కథనంపై జైశంకర్ స్పందించారు. “నాకు పాశ్చాత్య పత్రికల ఈ కామెంట్లు  చాలా వస్తున్నాయి. మరియు వారు మన ప్రజాస్వామ్యాన్ని విమర్శిస్తే..వారికి సమాచారం లేకపోవడం వల్ల కాదు. మన ఎన్నికల్లో వారు కూడా రాజకీయ మన రాజకీయ నేతల్లాగానే ఆలోచిస్తూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు..అని ఆయన కౌంటర్‌ ఇచ్చారు.

Read Also:Rahul Gandhi : బిలియనీర్ మిత్రుల కోసం రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ – రాహుల్

‘విదేశీ మీడియా భారత ప్రజాస్వామాన్ని హేళన చేస్తోంది. వారికి మన దేశానికి సంబంధించి సరైన సమాచారం లేదు. ఎందుకుంటే వారు కూడా మన దేశ ఎన్నికల్లో రాజకీయలు, జోక్యం చేసుకోవాలని యోచిస్తున్నారు. విదేశీ మీడియాలో పలు కథనాలు చదివారు. భారత్‌లో ప్రస్తుతం అత్యధిక వేడిగా ఉంది. ఈ సమయంలో భారత్ ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తోంది ?అని రాస్తున్నారు. అయినా పాశ్చాత్య దేశాల్లో ఓటింగ్‌ శాతం కంటే భారత్‌లో ఓటింగ్‌ శాతం ఎక్కువ. అని ఆయన అన్నారు.

Read Also:EVM : వీవీ ప్యాట్‌పై మధ్యాహ్నం 2 గంటల్లోపు వివరణ ఇవ్వండి: ఈసీకి సుప్రీంకోర్టు సూచన

మన దేశంలోని రాజకీయాలను ప్రపంచ వ్యాప్తంగా చర్చిస్తున్నారు. అదేవిధంగా ప్రపంచ రాజకియాలు.. ప్రస్తుతం భారత్‌లోకి చొరబడాలని భావిస్తున్నాయి. విదేశీ మీడియా మన ఎన్నికల వ్యవస్థలో భాగమని భావిస్తోంది. కానీ పాశ్చాత్య మీడియా ఆలోచనలకు చెక్‌ పెట్లాల్సిన సమయం వచ్చింది. విదేశీ మీడియా కథనాలకు తిప్పికొట్టాలి. మన ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘంపై విదేశీ మీడియా విమర్శలు చేస్తోంది’ అని జైశంకర్‌ అన్నారు.

Read Also:Indira Gandhi : దేశం కోసం ఇందిరాగాంధీ నగలిచ్చారా ? ప్రధాని మోడీ ‘మంగళసూత్రాల’ ఆరోపణ నిజమేనా ?