తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. కేరళలో మాతృభూమి మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకోకపోగా, మోసగిస్తున్న తీరు ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
Summer Tips: వేసవిలో ఈ 6 రకాల డ్రింక్స్ తాగితే చాలు.. భగభగ మండే ఎండలు సైతం మిమ్మల్ని ఏమి చేయలేవు!
రాష్ట్రాలు తమ జనాభాను సమర్థంగా నియంత్రించి, సంక్షేమ విధానాలను పకడ్బందీగా అమలు చేస్తే శిక్షిస్తున్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేకంగా నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరిగే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం అన్ని రాష్ట్రాలు ఏకతాటిలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణను అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు ఆయన వివరించారు. “తెలంగాణ రైజింగ్” అనేది నినాదం మాత్రమే కాకుండా, ఒక విధానమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ను కోర్ అర్బన్ ఏరియాగా గుర్తించి, నెట్ జీరో లెవల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రణాళికాబద్ధంగా నాలుగో నగరాన్ని నిర్మిస్తున్నామని, ఇది ప్రపంచంలోనే తొలి ప్రణాళికాబద్ధ నగరంగా నిలవనున్నట్లు వెల్లడించారు. గత పదేళ్లలో తెలంగాణ 25 వేల కోట్ల పెట్టుబడులను కూడా సాధించలేకపోయిందని, అయితే తాము వచ్చిన ఏడాదిన్నర లోపే రూ. 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సమకూర్చామని రేవంత్ రెడ్డి వివరించారు. అభివృద్ధి పరంగా తెలంగాణ దేశంలోనే ముఖ్యమైన రాష్ట్రంగా ఎదుగుతోందని తెలిపారు.