ITBP Constable Jobs : మొత్తం 200 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర హోం శాఖ పరిధిలో కార్యకలాపాలు నిర్వహించే ఐటీబీపీ ఈ పోస్టుల భర్తీ కోసం ఈ రోజు నుంచే దరఖాస్తులను స్వీకరిస్తోంది. సెప్టెంబరు 10లోగా ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు సమర్పించవచ్చు. మొత్తం 200 ఉద్యోగ ఖాళీలలో.. అత్యధికంగా 61 కానిస్టేబుల్ (కార్పెంటర్ – పురుషులు) పోస్టులు, 54 కానిస్టేబుల్ (మేసన్ – పురుషులు) పోస్టులు, 44 కానిస్టేబుల్ (ప్లంబర్ – పురుషులు) పోస్టులు ఉన్నాయి. మిగతా ఖాళీలలో.. 14 కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్ – పురుషులు) పోస్టులు, 10 కానిస్టేబుల్ (మేసన్ – మహిళలు) పోస్టులు, 10 కానిస్టేబుల్ (కార్పెంటర్ – మహిళలు) పోస్టులు, 8 కానిస్టేబుల్ (ప్లంబర్ – మహిళలు) పోస్టులు, 1 కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్- మహిళ) పోస్టులు ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join
ఐటీబీపీ భర్తీ చేస్తున్న మేసన్, కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ పోస్టులకు అప్లై చేయాలంటే పదోతరగతిలో పాస్ కావడంతో పాటు మేసన్/ కార్పెంటర్/ ప్లంబర్/ ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లలో ఐటీఐ పాసై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి. 2024 సెప్టెంబర్ 10 నాటికి అభ్యర్థుల వయస్సు 18- 23 ఏళ్లలోపు ఉండాలి. అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఫీజుగా రూ.100 కట్టాలి. మాజీ సైనిక ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు.
ఐటీబీపీ(ITBP Constable Jobs) ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులకు అప్లై చేసిన వారికి తొలుత రాత పరీక్ష ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ పద్ధతిలో ఉంటుది. పదో తరగతి సిలబస్ ఆధారంగా 100 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 మార్కులకు ఈ ఎగ్జామ్ జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ 20 ప్రశ్నలకు 20 మార్కులు, జనరల్ హిందీ 20 ప్రశ్నలకు 20 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలకు 20 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 20 ప్రశ్నలకు 20 మార్కులు, సింపుల్ రీజనింగ్ 20 ప్రశ్నలకు 20 మార్కులు ఉన్నాయి. ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ జాబ్స్‌కు ఎంపికయ్యే వారికి నెలవారీగా రూ.21,700 – రూ.69,100 వరకు పేస్కేలును అందిస్తారు.