Site icon HashtagU Telugu

Pushpak : ‘పుష్పక్’ హ్యాట్రిక్.. మూడోసారీ ప్రయోగం సక్సెస్

Pushpak

Pushpak : ఇస్రో  మరో విజయాన్ని సొంతం చేసుకుంది. దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన రీ-యూజబుల్‌ లాంచ్‌ వెహికిల్‌ (ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్-03) రాకెట్‌ ‘పుష్పక్‌’ను ఆదివారం ఉదయం 7 గంటలకు విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగించిన అనంతరం ఈ రాకెట్‌ విజయవంతంగా రన్‌వేపై ల్యాండ్ అయింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఏరో నాటికల్‌ టెస్టింగ్‌ రేంజ్‌లో ఈ ప్రయోగం జరిగింది. పుష్పక్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం ఇది మూడోసారి.

We’re now on WhatsApp. Click to Join

పుష్పక్(Pushpak) ప్రయోగం సక్సెస్ అయిన విషయాన్ని ‘ఎక్స్‌’ వేదికగా ఇస్రో వెల్లడించింది. ఈసందర్భంగా శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ అభినందనలు తెలిపారు. తదుపరిగా పుష్పక్‌ రాకెట్‌తో అర్బిటాల్‌ టెస్ట్‌ను నిర్వహిస్తామన్నారు. అంటే  పుష్పక్ రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగిస్తే తిరిగి భూమిపైకి వచ్చి సేఫ్‌గా ల్యాండ్ అవుతుంది. ఇప్పటివరకు అంతరిక్షంలోకి ప్రయోగించే రాకెట్లు సముద్రంలో కూలిపోతున్నాయి. ‘పుష్పక్’ రాకెట్ అలా కూలిపోకుండా..  అంతరిక్షంలోకి వెళ్లి, తిరిగి భూమివైపునకు దిశను మార్చుకొని సేఫ్‌గా రన్‌వే పైకి వచ్చి చేరుతుంది. పుష్పక్ రాకెట్ పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే మన దేశ అంతరిక్ష  ప్రయోగాల ఖర్చు గణనీయంగా తగ్గిపోతుంది.

Also Read :Telugu Man Died : సిగరెట్ ప్యాకెట్ కోసం కాల్పులు.. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

ప్రయోగం ఇలా.. 

‘పుష్పక్’ రాకెట్‌ను భారత వాయుసేనకు చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా దాదాపు 4.5 కి.మీ ఎత్తు నుంచి వదిలేశారు. గాల్లోకి విడుదలైన అనంతరం పుష్పక్ తనను తాను స్టార్ట్ చేసుకొని.. క్షితిజ సమాంతరంగా ఎగురుతూ రన్‌‌వే సెంటర్ లైనుపైకి చేరుకుంది. రన్ వేపైకి దిగిన టైంలో పుష్పక్ ల్యాండింగ్ వేగం గంటకు 320 కిలోమీటర్ల కంటే ఎక్కువే ఉంది. రన్‌వేపైకి పుష్పక్ రాకెట్ టచ్‌డౌన్ అయిన తర్వాత.. దాని వెనుక భాగంలో బిగించి ఉన్న బ్రేక్ పారాచూట్‌ తెరుచుకుంది. ఆ తర్వాత రాకెట్ ప్రయాణ వేగం గంటకు 100 కిలోమీటర్లకు తగ్గిపోయింది. తదుపరిగా పుష్పక్ రాకెట్‌లోని ల్యాండింగ్ గేర్ బ్రేక్‌లు పడటంతో.. కొంతదూరం ముందుకు వెళ్లి అది ఆగిపోయింది. సాధారణంగానైతే మనుషులు ప్రయాణించే విమానాలు గంటకు 260 కిలోమీటర్ల వేగంతో రన్‌వే‌పై ల్యాండ్ అవుతాయి. సాధారణ తరహా యుద్ధ విమానాలు గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ల్యాండింగ్ అవుతాయి.

Also Read :Cabinet Expansion : జులై ​ 2న మంత్రివర్గ విస్తరణ.. రేసులో ఉన్నది వీరే ?