Site icon HashtagU Telugu

Gaganyaan Success : ఇస్రో మరో ఘనత.. ‘గగన్‌యాన్’ తొలి ప్రయోగం సక్సెస్

Gaganyaan Mission

Gaganyaan Success

Gaganyaan Success : గగన్‌యాన్ మిషన్ తొలి ప్రయోగం సక్సెస్ అయింది. ఈ ప్రయోగ పరీక్ష శ్రీహరి కోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వేదికగా శనివారం ఉదయం 8 గంటలకు జరగాల్సి ఉండగా రెండుసార్లు వాయిదాపడింది.  తొలుత దాన్ని వాతావరణ సమస్యల కారణంగా 8.45 గంటలకు వాయిదా వేశారు. అనంతరం రాకెట్ లో సాంకేతిక లోపం బయటపడటంతో మరోసారి వాయిదా వేశారు. దీనివల్ల దాదాపు  2 గంటల పాటు ప్రయోగ పరీక్షలో జాప్యం జరిగింది. అనంతరం లోపాలను సవరించుకొని.. ఉదయం 10 గంటలకు నిర్వహించిన ప్రయోగ పరీక్షలో సానుకూల ఫలితాలు వచ్చాయి. గగన్‌యాన్ మిషన్ ప్రయోగం విజయవంతంగా పూర్తైంది. ఉదయం 10 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అది  17 కిలోమీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత.. అందులోని క్రూ మాడ్యూల్‌ వ్యవస్ధ వేరుపడింది. క్రూ మాడ్యూల్‌, క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ రాకెట్‌ నుంచి విడిపోయాయి. తర్వాత క్రూ మాడ్యూల్ కు ఉన్న పారాచూట్‌ విచ్చుకోవడంతో.. అది సెకనుకు 8.5 మీటర్ల వేగంతో భూమి వైపునకు దూసుకొచ్చి బంగాళాఖాతంలో (Gaganyaan Success) పడిపోయింది. అప్పటికే బంగాళాఖాతంలో సిద్ధంగా ఉన్న నేవీ సిబ్బంది వెంటనే వెళ్లి.. క్రూ మాడ్యూల్ ను సురక్షితంగా రికవరీ చేశారు. దీంతో ప్రయోగం సక్సెస్ ఫుల్ గా పూర్తయింది.

ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ ఏమన్నారంటే..

ఈ ప్రయోగం సక్సెస్ కావడంపై ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఈ ప్రయోగం విజయవంతమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. క్రూ ఎస్కేప్ మోడల్ ను నమూనాగా ప్రయోగించాలని నిర్ణయించాం. అనుకున్న విధంగానే ప్రయోగం జరిగింది. బంగాళాఖాతంలోకి దిగిన క్రూ మాడ్యూల్ ను రికవరీ చేశాం. దానిని అధ్యయనం చేస్తాం. మొదట్లో వాతావరణం ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో ప్రయోగ సమయాన్ని వాయిదా వేశాం. రాకెట్ ప్రయోగం మొదలయ్యే ముందు సాంకేతిక సమస్యను గుర్తించాం. దానిని సత్వరమే గుర్తించి సరి చేశాం. రాకెట్ స్థితి ని పరిశీలించి మళ్లీ ప్రయోగించాం. ఏదైనా సమస్య ఎదురైతే ఎలా సరిదిద్దాలనే విషయాన్ని మా బృందం చేసి చూపించింది’’ అని ఆయన వివరించారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రయోగం ఇలా జరిగింది.. 

Also Read: Man Crueal Attack on Dog కుక్క మొరిగిందని పక్కింటి వ్యక్తి క్రూరత్వం.. ప్రైవేట్ పార్ట్ లో రాడ్డుతో..!