Satellites Handshake : ఇస్రో ‘స్పేడెక్స్ మిషన్’లో కీలక ఘట్టం.. రెండు శాటిలైట్ల కరచాలనం

ఈ శాటిలైట్లు ప్రస్తుతం భూమి నుంచి 475 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్ష్యలో(Satellites Handshake)  కదలాడుతున్నాయి. 

Published By: HashtagU Telugu Desk
Spadex Mission Isro Indian Satellites Handshake

Satellites Handshake : ‘స్పేడెక్స్ మిషన్’ ద్వారా అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త చరిత్రను లిఖించింది.  పీఎస్‌ఎల్వీ -సీ60 రాకెట్‌ సహాయంతో 2024 డిసెంబరు 30న శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన రెండు భారతీయ శాటిలైట్లు ఛేజర్ (SDX01), టార్గెట్ (SDX02) ఒకదానికొకటి 15 మీటర్ల స్వల్ప దూరంతో గమనం సాగించాయి. దీనికి సంబంధించిన ఒక థ్రిల్లింగ్ వీడియోను ఇస్రో ఇవాళ విడుదల చేసింది.  ఆ రెండు శాటిలైట్లు అతి స్వల్ప దూరం నుంచి పరస్పర గమనం సాగించడాన్ని అద్భుతమైన కరచాలనం (హ్యాండ్ షేక్)గా ఇస్రో అభివర్ణించింది. మరో 50 అడుగుల దూరం కదిలితే ఇంకో అద్భుతమైన కరచాలనాన్ని ఛేజర్ (SDX01), టార్గెట్ (SDX02) శాటిలైట్లు చేస్తాయని వెల్లడించింది. ఈ శాటిలైట్లు ప్రస్తుతం భూమి నుంచి 475 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్ష్యలో(Satellites Handshake)  కదలాడుతున్నాయి. ఛేజర్ (SDX01), టార్గెట్ (SDX02)  శాటిలైట్లు గంటకు 28,800 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంటాయి. అంత వేగంతో కదిలే శాటిలైట్లను కంట్రోల్‌లోకి తీసుకొచ్చి  ఇస్రో అత్యంత సమీపంలోకి తీసుకురావడం అనేది గొప్ప విషయం. తదుపరిగా ఆ రెండు శాటిలైట్లను డాకింగ్ చేయించనున్నారు. ఈ ప్రక్రియ ఇవాళే పూర్తయ్యే అవకాశం ఉంది.

Also Read :Game Changer : మెగా ఫ్యాన్స్ కు భారీ షాక్..స్పెషల్ షోలు రద్దు

స్పేడెక్స్ మిషన్‌లో 2 ఘట్టాలు ఇవీ..

  • ‘స్పేడెక్స్ మిషన్’‌ తొలి ఘట్టంలో భాగంగా ఛేజర్ (SDX01), టార్గెట్ (SDX02)  శాటిలైట్లను అంతరిక్షంలో డాక్ (అనుసంధానం) చేస్తారు. ఇవాళే డాకింగ్ ప్రక్రియే పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రెండు శాటిలైట్ల డాకింగ్ (అనుసంధానం) పూర్తయిన తర్వాత, వాటి మధ్య ఇంధన పంపిణీ జరిగేలా చేస్తారు.
  • ‘స్పేడెక్స్ మిషన్’‌ రెండో ఘట్టంలో భాగంగా ఛేజర్ (SDX01), టార్గెట్ (SDX02) శాటిలైట్లను అన్‌డాక్ (విడదీయడం/వేరు చేయడం) చేస్తారు. వాటిని అన్ డాక్ చేశాక, భూమి నుంచి మానిటర్ చేస్తూ ఆపరేట్ చేస్తారు.

Also Read :Sankranti Gift : సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక

స్పేస్ డాకింగ్, అన్ డాకింగ్ కోసం ఇస్రో చాలా చౌకైన టెక్నాలజీని తయారు చేసింది. ఇది ఒకవేళ సక్సెస్ అయితే.. భారతదేశం చేపట్టిన  భారత అంతరిక్ష కేంద్ర ప్రాజెక్టుకు బలం చేకూరుతుంది. భారత అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. చంద్రయాన్-4 ప్రాజెక్టుకు, గగన్ యాన్ మిషన్‌లకు కూడా ఈ సాంకేతిక చేదోడుగా నిలుస్తుంది.  స్పేడెక్స్ మిషన్ సక్సెస్ అయితే ఈ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. స్పేస్ డాకింగ్ టెక్నాలజీలో అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఇప్పటిదాకా విజయం సాధించాయి.

  Last Updated: 12 Jan 2025, 07:43 AM IST