Isro Ayodhya Ram Mandir Pics : ఇస్రో పంపిన అయోధ్య రామ మందిర్ పిక్స్ ..ఎంత అద్భుతంగా ఉన్నాయో..!!

  • Written By:
  • Publish Date - January 21, 2024 / 07:11 PM IST

అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నో విశేషాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే రాముడి అవతారం..రామ మందిరం పిక్స్ బయటకు రాగా..తాజాగా అయోధ్య రామమందిర ఫోటోలను ఇస్రో (Isro) షేర్ చేసి మరింత వైరల్ చేసింది. Indian Remote Sensing శాటిలైట్స్‌ ద్వారా 2.7 ఎకరాల అయోధ్య ఆలయ స్థలాన్ని క్యాప్చర్ చేసింది. నిర్మాణ దశలో ఉన్న ఆలయాన్ని గత నెల డిసెంబర్ 16న ఫొటో తీసి షేర్ చేసింది ఇస్రో. అయితే..అప్పటి నుంచి మంచు కమ్మేయడం వల్ల మరోసారి ఫొటోలు తీసే అవకాశం లేకుండా పోయింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పుడు సరిగ్గా ఉత్సవానికి ఒక రోజు ముందు శాటిలైట్ ఇమేజెస్‌ని వైరల్ అవుతున్నాయి. అందులో దశరథ్ మహల్‌తో పాటు సరయూ నది చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే అయోధ్య ధామ్‌ రైల్వే స్టేషన్ సైతం కనిపిస్తుంది. ప్రస్తుతం భారతదేశం అంతరిక్షంలో 50కిపైగా ఉపగ్రహాలున్నాయి. హైదరాబాద్‌లోని ఇండియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి చిత్రాలను ఇస్రో క్లిక్‌మనిపించింది. అంతే కాదు రామ మందిర నిర్మాణంలో అనేక దశల్లో ఇస్రో సాంకేతికతను సైతం ఉపయోగించారు.

బాల రాముడి విగ్రహాన్ని సరిగ్గా ఎక్కడ ప్రతిష్ఠించాలో తెలుసుకునేందుకు ఇస్రో టెక్నాలజీ చాలా సహకారం అందించింది. రాముడు ఎక్కడైతే పుట్టాడని భావిస్తున్నారో కచ్చితంగా అక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భావించింది ట్రస్ట్. ఈ లొకేషన్‌ని గుర్తించేందుకు Larsen & Toubro కంపెనీ Global Positioning System (GPS) సహకారం తీసుకుంది. ఎక్కడ గర్భ గృహాన్ని నిర్మించాలో గుర్తించింది. ఇందుకోసం ఇస్రో తయారు చేసిన Navigation with Indian Constellation సహకారం తీసుకుంది.

Read Also : Ayodhya : మీరు తప్పక తెలుసుకోవాల్సిన అయోధ్య రామాలయ విశేషాలు