Threat Message To PM Modi: ఏకంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ గుర్తు తెలియని దుండగుల నుంచి ముంబై పోలీసులకు శనివారం బెదిరింపు మెసేజ్ వచ్చింది. ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్ లైన్‌కు సంబంధించిన వాట్సాప్ నంబరుకు శనివారం ఉదయం ఈ బెదిరింపు అందింది. ఆ మెసేజ్‌ను పంపిన ఫోన్ నంబరును పోలీసులు ట్రాక్ చేయగా.. దాని లొకేషన్ రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో ముంబై పోలీసులు ప్రత్యేక టీమ్‌ను అజ్మీర్‌కు(Threat Message To PM Modi) పంపారు. ఈ టీమ్ అజ్మీర్‌కు చేరుకొని.. బెదిరింపు మెసేజ్ పంపిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకోనుంది.
Also Read : World Billionaires 2024 : భారత్‌లో 185 మంది బిలియనీర్లు.. వీరిలో 108 మంది ఎవరంటే ?
ఈ బెదిరింపు మెసేజ్‌లో ఇద్దరు పాకిస్తానీ ఐఎస్ఐ గూఢచార ఏజెంట్ల గురించి ప్రస్తావన ఉండటం గమనార్హం. ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకొని ఆ ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లు బాంబు పేలుళ్లు జరుపుతామని అందులో ఉంది. ఈ బెదిరింపు మెసేజ్ ఆధారంగా ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల ఆధారంగా అభియోగాలను నమోదు చేశారు. గత కొన్ని నెలల వ్యవధిలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి సెలబ్రిటీలకు పలుమార్లు ఇదే విధంగా బెదిరింపులు వచ్చాయి. అయితేే ఆ బెదిరింపు మెసేజ్‌లు కూడా ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబరుకే రావడం గమనార్హం.