Congress Vs Shashi Tharoor: శశిథరూర్‌పై వేటుకు కాంగ్రెస్ రెడీ అవుతోందా ?

అఖిలపక్షం విదేశీ పర్యటన కోసం కాంగ్రెస్ పార్టీ(Congress Vs Shashi Tharoor) హైకమాండ్ ఇటీవలే నలుగురు ఎంపీల పేర్లను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు సిఫారసు చేసింది.

Published By: HashtagU Telugu Desk
Congress Party Shashi Tharoor Kerala Pm Modi Bjp

Congress Vs Shashi Tharoor:  సీనియర్ నేత శశిథరూర్.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు కొరకరాని కొయ్యగా మారారు. కాంగ్రెస్ పెద్దలతో శశిథరూర్‌కు గ్యాప్ పెరిగిందని గ్రహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తనదైన శైలిలో రాజకీయ పావులు కదుపుతున్నారు. ఆయనను బీజేపీకి చేరువ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే కొన్ని వారాల క్రితం కేరళలో అదానీ పోర్ట్ ప్రారంభోత్సవం వేళ.. సభా వేదికపై ఉన్న అందరినీ వదిలేసి థరూర్‌కు మాత్రమే మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. కట్ చేస్తే.. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి అగ్రరాజ్యం అమెరికాకు వివరించే కీలక బాధ్యతలను థరూర్‌కు మోడీ అప్పగించారు. భారత్ తరఫున అమెరికాకు వెళ్లనున్న అఖిలపక్ష టీమ్‌కు థరూర్  సారథ్యం వహించనున్నారు. ప్రధాని మోడీ సూచన మేరకే థరూర్‌కు ఈ అవకాశాన్ని కల్పించినట్లు సమాచారం.

Also Read :Pakistani Spies : హర్యానాలో పాక్ గూఢచారుల ముఠా.. పహల్గాం ఉగ్రదాడితో లింక్ ?

మోడీ సూచనతోనే థరూర్‌కు ఆ ఛాన్స్

అఖిలపక్షం విదేశీ పర్యటన కోసం కాంగ్రెస్ పార్టీ(Congress Vs Shashi Tharoor) హైకమాండ్ ఇటీవలే నలుగురు ఎంపీల పేర్లను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు సిఫారసు చేసింది. ఈ జాబితాలో శశిథరూర్ పేరు లేదు. అయినప్పటికీ ఆయనకు ప్రత్యేక టీమ్ సారథ్య బాధ్యతలను మోడీ సర్కారు అప్పగించడం గమనార్హం.  బీజేపీలోని దిగ్గజ నేతలను వదిలేసి.. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న థరూర్‌కే ఈ ఛాన్స్ ఎందుకిచ్చారు ? అనే దానిపై ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీలోకి థరూర్ వస్తారని కొందరు చెబుతుండగా.. మోడీజీ రాజకీయ వ్యూహాన్ని ఎవరూ అంచనా వేయలేరని ఇంకొందరు అంటున్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ బలోపేతం కోసం థరూర్ లాంటి నేతల అవసరం ఉందని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే  2026లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి బీజేపీలోకి థరూర్ జంప్ అవుతారనే అనుమానాలు బలపడుతున్నాయి.

Also Read :Sofiya Qureshi : ‘ఆపరేషన్ సిందూర్‌’పై వ్యాఖ్యలు.. అలీఖాన్‌ అరెస్ట్.. విజయ్ షాకు మినహాయింపు

వీలైనంత త్వరగా వదిలించుకుంటారా ? 

ఏదిఏమైనప్పటికీ ఈ పరిణామాలు కాంగ్రెస్ హైకమాండ్‌ను విస్మయానికి గురి చేస్తున్నాయి. ఈనేపథ్యంలో శశిథరూర్‌ విషయంలో ఏం చేద్దాం ? అనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.  ఆయనపై వెంటనే వేటు వేద్దామా ? వచ్చే ఎన్నికల వరకు వేచిచూద్దామా ? అనే అంశంపై హస్తం పార్టీ పెద్దల మధ్య చర్చలు జరుగుతున్నాయట.  థరూర్‌ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ,  కేంద్రంలోని బీజేపీ సర్కారును మెచ్చుకుంటూ ఉంటే అది హస్తం పార్టీకి రాజకీయంగా నష్టాన్ని కలిగిస్తుందని పరిశీలకులు అంటున్నారు. థరూర్ తరహాలో వ్యవహరించే నేతలను వీలైనంత త్వరగా వదిలించుకుంటేనే మంచిదని చెబుతున్నారు.

  Last Updated: 19 May 2025, 11:22 AM IST