వేసవి సెలవుల్లో చాలా మంది చల్లని వాతావరణం కోసం హిమాచల్‌ప్రదేశ్ టూర్లకు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) “హిమాచల్ హిల్స్ అండ్ వ్యాలీస్” పేరుతో ప్రత్యేకంగా 6 రాత్రులు, 7 పగళ్లు గల ప్యాకేజీ(IRCTC’s Himachal Hills & Valleys Package)ని అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్‌లో షిమ్లా, మనాలీ, చండీగఢ్‌లలోని ప్రముఖ ప్రదేశాలను విహరించే అవకాశం లభిస్తుంది.
Anchor Rashmi : యాంకర్ రష్మీకి సర్జరీ..ఎందుకంటే !
ఈ ప్యాకేజీ ప్రకారం.. ట్రిప్ మొదలు హైదరాబాద్ (Hyderabad) నుండి మే 6వ తేదీన ఉదయం 9:30కి చండీగఢ్‌కి విమాన ప్రయాణంతో ప్రారంభమవుతుంది. అక్కడినుంచి షిమ్లాకు తీసుకెళ్లి అక్కడి పర్యాటక ప్రాంతాలు (కుఫ్రీ, హనుమాన్ మందిర్, మాల్ రోడ్) చూపించబడతాయి. తర్వాత మనాలీకి తరలించి సోలాంగ్ వ్యాలీ, హడింబా టెంపుల్, రొహతంగ్ పాస్‌ను సందర్శించే అవకాశం ఉంది. చివరిగా చండీగఢ్‌కి తిరిగి వచ్చి రాక్ గార్డెన్ చూసిన తర్వాత హైదరాబాద్‌కి రిటర్న్ జర్నీ జరుగుతుంది.
Auto Driver To Billionaire : నాడు ఆటో డ్రైవర్.. నేడు బిలియనీర్.. రూ.800 కోట్ల వ్యాపార సామ్రాజ్యం
ప్యాకేజీ ఖర్చుల వివరాలు.. సింగిల్ షేరింగ్‌కు రూ. 62,650, డబుల్ షేరింగ్‌కు రూ.45,900, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.43,250గా నిర్ణయించారు. చిన్నారుల కోసం వేర్వేరు ధరలు ఉన్నాయి. ప్యాకేజీలో విమాన టికెట్లు, హోటల్ బస, 6 బ్రేక్‌ఫాస్ట్‌లు, 6 డిన్నర్‌లు, ఏసీ ట్రావెలింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా కలదు. లంచ్ మాత్రం ప్రయాణికులే చూసుకోవాలి. చల్లని ప్రదేశాలకు రిలాక్సింగ్ ట్రిప్ కావాలనుకునే వారి కోసం ఇది సూపర్ ఆఫర్‌గా మారింది.