Interim Budget : ఫిషరీస్ ప్రాజెక్టును ప్రోత్సహించేందుకు 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులు

  • Written By:
  • Publish Date - February 1, 2024 / 01:18 PM IST

2024-25 సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్‌ (Interim Budget)ను ప్రవేశపెట్టారు. దాదాపు గంటసేపు బడ్జెట్ ప్రసంగం జరిగింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో రవాణా రంగానికి సంబంధించి పలు ప్రతిపాదనలు చేశారు. గురువారం తన బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) రైల్వే శాఖకు చెందిన కొన్ని ప్రాజెక్టులను కూడా ప్రస్తావించారు. మూడు ప్రధాన రైల్వే ఆర్థిక కారిడార్లను నిర్మించనున్నారు. పీఎం గతి శక్తి యోజన కింద వీటిని గుర్తించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు (Integrated Aqua Parks) లను ప్రారంభించనుంది. ఫిషరీస్ ప్రాజెక్టును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 మధ్యంతర బడ్జెట్ సమర్పణలో “`లఖపతి దీదీ యోజన” (Lakpati Didi Yojana) ను ప్రతిపాదించారు. ఈ పథకం ద్వారా 2025 నాటికి లక్షల మంది మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దుతామన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

2024-25 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం రూ. 26.02 లక్షల కోట్లు. 2024 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును జిడిపిలో 5.8 శాతానికి తగ్గించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని ‘అభివృద్ధి చెందిన భారతదేశం’గా మార్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ అభివృద్ధి అన్ని రంగాలకు విస్తరించి ఉంటుందని మంత్రి తెలిపారు. నిర్మలా సీతారామన్‌కి ఇది వరుసగా ఆరో బడ్జెట్‌. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పెళుసుగా ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు (ఉక్రెయిన్, గాజాలో యుద్ధాలు, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరియు ఉగ్రవాదం వంటివి) ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లను సృష్టించాయి. ఈ సవాళ్లను అధిగమించి దేశం అభివృద్ధిని సాధిస్తుందన్న విశ్వాసం ప్రభుత్వం ఉందని మంత్రి తెలిపారు. మధ్యంతర బడ్జెట్ ప్రసంగాన్ని ముగించిన తర్వాత, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఆర్థిక బిల్లు 2024ను సమర్పించారు.

Read Also :  Bharat Rice : రేపటి నుంచి మార్కెట్‌లోకి భారత్ రైస్..ధర చాల తక్కువ