Inside UAE Temple : ఇవాళ అబుధాబిలో మోడీ సభ.. తొలి హిందూ దేవాలయం ఫొటోలివీ

Inside UAE Temple : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE)లోని అబుధాబిలో నిర్మించిన తొలి హిందూ దేవాలయం బుధవారం ప్రారంభం కానుంది.

Published By: HashtagU Telugu Desk
Uae Temple 1

Uae Temple 1

Inside UAE Temple : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE)లోని అబుధాబిలో నిర్మించిన తొలి హిందూ దేవాలయం బుధవారం ప్రారంభం కానుంది. దీన్ని స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఇందుకోసం రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ మంగళవారం యూఏఈకి వెళ్తున్నారు.  బుధవార రోజు ఆలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యే అతిథులకు జ్ఞాపకంగా పలు బహుమతులు ప్రధాని అందజేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join

అబుధాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మంగళవారం సాయంత్రం ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం స్టేడియం గేట్లను తెరుస్తారు. సాయంత్రం 5 గంటలకు గేట్లను మూసేస్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత మోడీ వచ్చి ప్రసంగిస్తారని భావిస్తున్నారు.

Also Read : Delhi Chalo : కేంద్రంతో చర్చలు విఫలం.. ‘చలో ఢిల్లీ’కి బయలుదేరిన రైతులు

ప్రధాని మోడీ ఇచ్చే ప్రసంగాన్ని వినడానికి 60,000 మందికిపైగా భారతీయులు స్టేడియంకు చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. అబుధాబి స్టేడియంలో ప్రేక్షకులను అలరించడానికి 700 మందికిపైగా స్థానిక కళాకారులతో సన్నాహాలు జరుగుతున్నాయి. UAE నుంచి 1,500 మందికిపైగా వాలంటీర్లు పెద్ద ఎత్తున స్టేడియం సమావేశాల నిర్వహణ మరియు ప్రణాళిక ప్రక్రియలో భాగంగా ఉన్నారు.

బుధవారం రోజు దుబాయ్‌లో జరిగే ప్రపంచ ప్రభుత్వాల సదస్సులో మోడీ పాల్గొంటారు. అంతకంటే ముందు అబుధాబిలో నిర్మించిన తొలి హిందూ దేవాలయాన్ని భారత ప్రధాని ప్రారంభిస్తారు. అబుధాబిలోని హిందూ ఆలయం ముఖ భాగాన్ని రాజస్థాన్, గుజరాత్‌కు చెందిన 25,000 మంది కళాకారులు రూపుదిద్దారు.

ఆలయం నిర్మాణం కోసం రాజస్థాన్ నుంచి అబుధాబికి గులాబీ ఇసుకరాయి పంపించారు. 40,000 క్యూబిక్ ఫీట్ల పాలరాతితో ఆలయంలోని ఇంటీరియర్స్‌ను నిర్మించారు.  ఉపాధి అవసరాల కోసం UAEలో దాదాపు 35 లక్షల మంది భారతీయులు ఉంటున్నారు.

  Last Updated: 13 Feb 2024, 07:47 AM IST