Stalin : తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ స్టాలిన్ డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం డీలిమిటేషన్ ప్రవేశపెడితే తమ హక్కుల్ని కాలరాస్తాయని, రాష్ట్రాల్లోని ఎంపీ సీట్లు తగ్గుతాయని స్టాలిన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జనాభా నియంత్రణలో మెరుగ్గా వ్యవహరించిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందని స్టాలిన్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఓ రేంజ్ లో నడుపుతున్న స్టాలిన్ తాజాగా దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపైనా అందర్నీ ఏకతాటిపైకి తేవాలని నిర్ణయంచుకున్నారు.
Read Also: Mahabubabad : పోలీస్ స్టేషన్ ను బార్ గా మార్చిన పోలీసులు
ఈ మేరకు దక్షిణాదిలోని కీలక నేతలందరికీ సమావేశం అవుదామని ఆహ్వానం పంపారు. ఈ నెల 22వ తేదీన చెన్నైలో సమావేశం అవుదామని పిలుపునిచ్చారు. కర్ణాటక, కేరళతో పాటు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలకూ ఈ ఆహ్వానాన్ని పంపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, ఏపీ సీఎం చంద్రబాబు, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మారీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీల, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామిలను ఆహ్వానించారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, తెలంగాణ, ఏపీ కాంగ్రెస్, టీడీపీ, జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని పలు పార్టీల చీప్ కి లేఖలు రాశారు. మార్చి 22న చెన్నైలో మొదటి జేఏసీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీరంతా జేఏసీలో చేరాలని, పార్టీలోని ముఖ్య నేతలను ప్రతినిధులుగా ఈ సమావేశానికి పంపాల్సిందిగా స్టాలిన్ కోరారు.
కాగా, లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనలో జనాభా ప్రాతిపదికన దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న వాదనను చాలా మంది వినిపిస్తున్నారు. అయితే ఇంకా డీలిమిటేషన్ విధి విదానాలు ఖరారు కాలేదు. కానీ జనాభాను సమర్థంగా నియంత్రించినందున దక్షిణాదికి ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సింది పోయి పనిష్మెంట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే పోరాడాలని స్టాలిన్ నిర్ణయించుకున్నారు.