Site icon HashtagU Telugu

IndiGo: 2 గంటల్లో నేరుగా హైదరాబాద్ నుంచి కొలంబో ఇండిగో ఫ్లైట్

Indigo Flight Gate Locked

Indigo Flight Gate Locked

IndiGo: ఇండిగో నవంబర్ 2 నుండి హైదరాబాద్ మరియు కొలంబోల మధ్య కొత్తగా విమానాలను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. రెండు నగరాల మధ్య ప్రత్యక్ష కనెక్టివిటీని అందించిన మొదటి భారతీయ రవాణా సంస్థ ఇది. ఫలితంగా వాణిజ్యం, ఆర్థికం మరియు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం అవుతాయి. ఇండిగోలో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా మాట్లాడుతూ ఈ విమానాల కనెక్టివిటీని మెరుగుపరచడమే కాకుండా ప్రయాణికులకు ఎక్కువ సౌలభ్యం మరియు సౌకర్యాన్ని అందిస్తుందని చెప్పారు.తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలనుకునే కస్టమర్‌లు అధికారిక వెబ్‌సైట్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు అని అన్నారు.

షెడ్యూల్‌లో ఫ్లైట్ 6E 1181 హైదరాబాద్-కొలంబో బుధవారం మినహా ప్రతిరోజూ నడుస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. అదేవిధంగా ఫ్లైట్ నెం 6E 1182 కొలంబో-హైదరాబాద్ బుధవారం మినహా ప్రతిరోజూ నడుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు చేరుకుంటుంది.

Also Read: Ganesh Mandapam : గణేష్ మండపంలో శివుడి మేడలో ప్రత్యక్షమైన నాగుపాము..భక్తి పరవశంలో భక్తులు