Indigo : అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘటన మరువకముందే, విమాన ప్రయాణాల్లో సాంకేతిక లోపాలు కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలోనే, సూరత్ నుండి దుబాయ్ వెళ్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. మంగళవారం 150 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానం, ఇంజిన్ లోపం కారణంగా అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి సరైన నిర్ణయం తీసుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
మంగళవారం ఉదయం సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఇండిగో విమానం 6E-1507 గాల్లోకి ఎగిరిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. విమానం ఇంజిన్‌లో సమస్య ఉన్నట్లు గుర్తించిన ఎయిర్‌లైన్స్ సిబ్బంది, తక్షణమే అహ్మదాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు.
Voter Adhikar Yatra : బీజేపీ-ఎన్నికల సంఘం కుమ్మక్కు: ప్రజాస్వామ్యానికి అపహాస్యమన్న రాహుల్ గాంధీ
విమానంలో సాంకేతిక సమస్య గురించి ప్రయాణికులకు తెలియగానే ఒక్కసారిగా క్యాబిన్ అంతా భయాందోళనలకు గురైంది. కొంతమంది ప్రయాణికులు ప్రార్థనలు చేసుకోగా, మరికొందరు తమ బంధువులకు ఫోన్ చేసి పరిస్థితిని తెలిపారు. అయితే, పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులందరూ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అత్యవసర ల్యాండింగ్ తర్వాత ఇండిగో ఇంజనీరింగ్ బృందం వెంటనే విమానాన్ని తనిఖీ చేసి, ఇంజిన్ సమస్యను గుర్తించింది. ప్రయాణికులు దుబాయ్ చేరుకోవడానికి ఇండిగో సంస్థ మరో విమానాన్ని ఏర్పాటు చేసి పంపింది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి సమాచారం అందించగా, ఈ సమస్య సాంకేతిక లోపమా లేక మెకానికల్ వైఫల్యమా అనే దానిపై పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించనుంది.
Hyderabad : గణేష్ నిమజ్జనానికి సిద్ధం.. ఏర్పాట్లపై సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు