Inflation: దేశంలో ద్రవ్యోల్బణం (Inflation) తగ్గుతోంది. దీని ప్రభావం సామాన్య ప్రజలకు ఊరటను కలిగిస్తోంది. నేడు కేంద్ర ప్రభుత్వం టోకు ధరల సూచీ (WPI) గణాంకాలను విడుదల చేసింది. జూన్ నెలలో WPI 20 నెలల కనిష్ఠ స్థాయి 0.13 శాతానికి చేరిందని, ఇది అక్టోబర్ 2023 తర్వాత అత్యల్ప స్థాయి అని తెలిపింది. మే నెలలో టోకు ధరల సూచీ 0.39 శాతంగా ఉంది. అంటే మొత్తంగా దేశంలో ద్రవ్యోల్బణం వేగంగా తగ్గింది. క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు, ఖనిజ తైలం, బేసిక్ మెటల్స్ తయారీ సరసమైన ధరలకు అందుబాటులోకి రావడం వల్ల ఈ క్షీణత సంభవించిందని ప్రభుత్వం తెలిపింది. అంతేకాక, ఆహార పదార్థాల ధరలు కూడా తగ్గాయని పేర్కొంది.
సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరలు
జూన్ నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 22.65 శాతానికి తగ్గింది. ఇది మే నెలలో 21.62 శాతంగా ఉంది. ఉల్లిపాయల ద్రవ్యోల్బణం 33.49 శాతంగా ఉంది. ఇది మే నెలలో 14.41 శాతంగా ఉంది. ఈ సమయంలో బంగాళదుంపల ధరలు 32.67 శాతం వరకు గణనీయంగా తగ్గాయి. మే నెలలో ఇది 29.42 శాతం తక్కువగా ఉంది. పప్పు ధరలు కూడా 22.65 శాతం వరకు తగ్గాయి,. మే నెలలో ఇది 10.41 శాతం తగ్గింది.
ధాన్యాల ద్రవ్యోల్బణం కూడా 3.75 శాతం తగ్గింది. మే నెలలో ఇది 2.56 శాతంగా ఉంది. మొత్తంగా వంటగది సామగ్రి సరసమైన ధరలకు అందుబాటులోకి రావడంతో సామాన్య ప్రజలకు ఊరట లభించింది.
Also Read: Nara Lokesh : వంద రోజుల చాలెంజ్..మంగళగిరిలో గుంతలు లేని రోడ్డు: మంత్రి లోకేశ్
ఇంధనం- విద్యుత్ ధరలు కూడా తగ్గాయి
ఈ సమయంలో ఇంధనం, విద్యుత్ ధరలు కూడా నియంత్రణలో ఉన్నాయి. జూన్ నెలలో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 2.65 శాతంగా ఉంది. ఇది మే నెలలో 22.27 శాతంగా ఉంది. అంటే ఇంధనం, విద్యుత్ ధరలలో కూడా గణనీయమైన తగ్గుదల కనిపించింది. అదే సమయంలో తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 1.97 శాతంగా ఉంది. ఇది WPI బాస్కెట్‌లో 60 శాతం వాటాను కలిగి ఉంది. ప్రాథమిక వస్తువుల (ప్రైమరీ ఆర్టికల్స్) ద్రవ్యోల్బణం జూన్ నెలలో 3.38 శాతం వరకు తగ్గింది. మే నెలలో ఇది 2.02 శాతం తగ్గింది.