Jeetega Bharat : తమ కూటమికి “ఇండియా” అని పేరు పెట్టుకున్న ప్రతిపక్ష పార్టీలు.. దానికి ట్యాగ్‌లైన్‌గా “జీతేగా భారత్”ను ఎంచుకున్నాయి. హిందీ భాషతో పాటు దేశంలోని అన్ని భాషల్లో ఈ ట్యాగ్‌లైన్ ను వాడుతామని వెల్లడించాయి.. జీతేగా భారత్ అంటే “భారతదేశం గెలుస్తుంది”(Jeetega Bharat) అని అర్ధం. ప్రతిపక్ష కూటమి పేరులో “ఇండియా” అనే పదం రాగా, ఇప్పుడు ట్యాగ్‌లైన్ లో “భారత్” అనే పదం వచ్చేలా చేశారు. “ప్రతిసారి ఎన్నికల్లో దేశభక్తి, జాతీయవాదం ఫార్ములాతో ఓట్లు పొందేందుకు బీజేపీ యత్నిస్తుంది. దానికి చెక్ పెట్టే లక్ష్యంతోనే ఈవిధంగా కూటమి పేరు, ట్యాగ్‌లైన్‌లలో ఇండియా, భారత్ వచ్చేలా చేశాం” అని విపక్ష కూటమిలోని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also read : Aircraft Emergency Landing : సోనియా, రాహుల్ వెళ్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!
విపక్ష కూటమి పేరుగా ఎంపిక చేసిన “ఇండియా” యొక్క ఫుల్ ఫామ్ .. “ఇండియా నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్”. రెండో రోజు(మంగళవారం) బెంగళూరులో జరిగిన 26 విపక్ష పార్టీల మీటింగ్ లో.. “కూటమిలోని ఇతర పార్టీలకు ప్రధానమంత్రి కుర్చీ ఇవ్వడానికి కూడా మేం రెడీయే” అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.