Imphal Missile Destroyer : భారత నౌకాదళం ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా మరో విజయం సాధించింది. మన సముద్ర తీర ప్రాంతాలను టార్గెట్ చేస్తూ శత్రుదేశాల వైపు నుంచి వచ్చే మిస్సైళ్లను కూల్చేసే సామర్థ్యం కలిగిన స్వదేశీ మిస్సైల్ డెస్ట్రాయర్ ‘ఇంఫాల్’ (యార్డ్ 12706)ను ఆర్మీ విజయవంతంగా పరీక్షించింది. ఇంఫాల్ అనే మిస్సైల్ డెస్ట్రాయర్ యుద్ధ నౌక నుంచి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ‘బ్రహ్మోస్’ క్షిపణిని ప్రయోగించగా.. గంటకు 4321 కిలోమీటర్ల వేగంతో, 90 డిగ్రీల కోణంలో దూసుకెళ్లి సముద్రంలోని నిర్దేశిత లక్ష్యాన్ని తునాతునకలు చేసింది. బ్రహ్మోస్ క్షిపణికి 200 కేజీల వార్‌హెడ్‌ను మోసుకెళ్లే సామర్థ్యం కూడా ఉందని మనం గుర్తుంచుకోవాలి. త్వరలోనే ‘ఇంఫాల్’ మిస్సైల్ డెస్ట్రాయర్ నౌకను భారత నేవీకి అందించనున్నారు. ఈనేపథ్యంలోనే దాని నుంచి ప్రయోగించే క్షిపణుల పనితీరును చెక్ చేసేందుకు ఈ ప్రయోగ పరీక్షను నిర్వహించారు. ‘ఇంఫాల్’ మిస్సైల్ డెస్ట్రాయర్‌కు మరో పేరు కూడా ఉంది.. అదేమిటో తెలుసా ? ‘విశాఖపట్నం క్లాస్ స్వదేశీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్’.
We’re now on WhatsApp. Click to Join.
- ‘ఇంఫాల్ మిస్సైల్ డెస్ట్రాయర్’ను ఇండియన్ నేవీకి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో (WDB) రూపొందించింది.
- దీని పొడవు 164 మీటర్లు.
- ఇందులో ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు, యాంటీ షిప్ క్షిపణులు, టార్పెడోలు ఉంటాయి.
- ఇది సముద్రంలో గంటకు 56 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
- ఇందులో వాడే ఆయుధాలు, మెటీరియల్‌లో 75 శాతం మన దేశంలోనే తయారయ్యాయి.
- ఇందులో వినియోగించే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్‌ను బెంగళూరులోని ‘బెల్’ సంస్థ తయారు చేస్తుంది.
- బ్రహ్మోస్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్స్‌ను న్యూఢిల్లీలోని ‘బ్రహ్మోస్ ఏరోస్పేస్’ తయారు చేస్తుంది.
- స్వదేశీ టార్పెడో ట్యూబ్ లాంచర్లను ముంబైలోని ‘లార్సెన్ అండ్ టూబ్రో’ తయారు చేస్తుంది.
- యాంటీ సబ్‌మెరైన్ స్వదేశీ రాకెట్ లాంచర్లను ముంబైలోని ‘లార్సెన్ అండ్ టూబ్రో’ తయారు చేస్తుంది.
- 76 మిమీ సూపర్ రాపిడ్ గన్ మౌంట్‌ను హరిద్వార్‌లోని ‘బీహెచ్‌ఈఎల్’(Imphal Missile Destroyer) తయారు చేస్తుంది.
Also Read: Bill Gates – Drainage : డ్రైనేజీలోకి దిగిన అపర కుబేరుడు బిల్‌గేట్స్.. ఎందుకు ?
VIDEO | Imphal (Yard 12706), Indian Navy’s latest indigenous guided missile destroyer, scored ‘Bulls Eye’ in her maiden Brahmos firing at sea.
(Source: Third Party) pic.twitter.com/39QkAdCs50
— Press Trust of India (@PTI_News) November 22, 2023