First Bullet Train : బుల్లెట్ ట్రైన్.. ఇది ఇండియా డ్రీమ్. దీన్ని సాకారం చేసుకునే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. మొట్టమొదటి బుల్లెట్ రైలు సెక్షన్.. 2026 ఆగష్టు నాటికి అందుబాటులోకి రానుంది. 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో గుజరాత్‌లోని బిలిమోరా-సూరత్ మధ్య తొలి బుల్లెట్ రైలు కారిడార్ ఉంటుంది. బుల్లెట్ రైలుకు సంబంధించి ముంబై-అహ్మదాబాద్ మధ్య 100 కిలోమీటర్ల వయాడక్ట్, 230 కిలోమీటర్ల పైర్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. ఈ కారిడార్‌లో బిలిమొరా-సూరత్ సెక్షన్ మొదట కంప్లీట్ అవుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు అహ్మదాబాద్-ముంబయి మధ్య ఊపందుకున్నాయి. ఈ రైలు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. ఇప్పటికే 251కి.మీ మేర పిల్లర్లు, 103 కి.మీ మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం జరిగింది. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబైకి చేరుకోవచ్చు. బుల్లెట్ ట్రైన్ తొలి ప్రయోగాత్మక పరుగును 2026లో చేపట్టేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, కొవిడ్ ముందుతో పోలిస్తే కొత్త రైళ్ల సంఖ్యను పెంచామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం వెల్లడించారు. 1768 మెయిల్/ఎక్స్‌ప్రెస్ సర్వీసుల సంఖ్యను 2124కు, సబర్బన్ సర్వీసులను 5626 నుంచి 5774 వరకు పెంచామన్నారు. ప్యాసింజర్ రైళ్ల సంఖ్య 2792 ఉండగా 2856కు(First Bullet Train) పెరిగిందన్నారు.