Site icon HashtagU Telugu

Fastest Router : దేశంలోనే స్పీడ్ రూటర్ రెడీ.. ఇంటర్నెట్ వేగం సెకనుకు 2,400 జీబీ

Fastest Router

Fastest Router

Fastest Router : మన దేశంలోనే వేగవంతమైన ఇంటర్నెట్ రూటర్‌ ప్రారంభమైంది. దీని సామర్థ్యం 2.4 టీబీపీఎస్‌. టీబీపీఎస్‌ అంటే టెర్రా బైట్స్  పర్ సెకండ్ !! అంటే దాదాపు  2,400 జీబీపీఎస్ (గిగా బైట్స్ పర్ సెకండ్) !! ఒక టెరాబైట్ అంటే 1000 గిగాబైట్‌లు, ఒక ట్రిలియన్ బైట్‌లకు సమానం. ఈ రూటర్‌ను టెలికాం డిపార్ట్‌మెంట్, సీడీవోటీ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలీ మ్యాటిక్స్), భారత ప్రభుత్వ ‘నివేతి సిస్టమ్’ సహాయంతో రూపొందించారు. దీన్ని పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేశారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read : Anil Ambani : అయ్యో అనిల్ అంబానీ.. రూ.1100 కోట్ల కష్టం !

ఇంటర్నెట్ రూటర్ స్పీడ్  రేంజ్..  

భారత్‌లో అత్యంత వేగవంతమైన నివెట్టి సిస్టమ్స్ ఇంటర్నెట్ రూటర్ చాలా స్పీడ్‌గా పనిచేస్తుంది. మనింట్లో ఒక డివైజ్ నుంచి ఒక డివైజ్ కి ఒక్క సినిమాని ట్రాన్స్ ఫర్ చేయాలంటే కనీసం రెండు నిమిషాలన్నా(హై స్పీడ్ లో) పడుతుంది. మరి ఓ వెయ్యి సినిమాలని నాలుగు సెకన్లలో ట్రాన్స్ ఫర్ చేయగలిగితే ఎలా ఉంటుంది? ఇంకా టెక్నీకల్ భాషలో చెప్పాలంటే.. ఒక జీబీ డేటాను ట్రాన్స్ ఫర్ చేయాలంటే కనీసం 2 నిమిషాలు పడుతుంది. అలాంటిది 1000 జీబీ డేటాను నాలుగు సెకన్లలోనే ట్రాన్స్ ఫర్ చేయగలిగితే.. అలాంటి రూటర్ రెడీ అయితే.. భలే ఉంటుంది అనిపిస్తోంది కదూ. అదిగో ఆ భలే అద్భుతాన్ని మన దేశంలో సిద్ధం చేసేశారు. అదే నివెట్టి సిస్టమ్స్ ఇంటర్నెట్ రూటర్ !!

Also Read : Mudragada Padmanabham: వైసీపీలోకి ముద్రగడ చేరికకు టైం ఫిక్స్