Maharashtra : నేపాల్‌లోని తనహున్ జిల్లాలో భారత ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు నదిలో పడిపోయిన ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఆ బస్సులోని 43 మందిలో 41 మంది చనిపోయారని అధికార వర్గాలు ప్రకటించాయి. వీరిలో 40 మంది మహారాష్ట్రకు చెందిన యాత్రికులే కాగా, మిగతా ముగ్గురు బస్సులో పనిచేసే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సిబ్బంది అని అంటున్నారు. మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ కూడా ఈ మరణాల వివరాలను ధృవీకరించారు. డెడ్‌బాడీలను తీసుకొచ్చేందుకుగానూ నేపాల్ ప్రభుత్వం, ఢిల్లీలోని నేపాల్(Maharashtra) ఎంబసీతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. ఈక్రమంలో తమకు నేపాల్‌లోని భారత ఎంబసీ నుంచి సహకారం లభిస్తోందన్నారు.
We’re now on WhatsApp. Click to Join
భారతీయ పర్యాటకుల మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చే అంశంపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర సీనియర్ కేంద్ర అధికారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సీఎం షిండేకు అమిత్ షా హామీ ఇచ్చారు. భారతీయ వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం ఆదివారం రోజు 24 మంది పర్యాటకుల మృతదేహాలను నాసిక్‌కు తీసుకువస్తుంది. అనంతరం వాటిని బాధిత కుటుంబాలకు అప్పగిస్తారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ మహారాష్ట్ర సీఎం షిండే కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి శుక్రవారం రాత్రి సమయానికి బస్సులోని 43 మందిలో 27 మందే చనిపోయారు. మిగతా 16 మంది క్షతగాత్రులను ఆస్పత్రుల్లో చేర్పించగా, చికిత్స పొందుతూ 14 మంది ప్రాణాలు విడిచారు.
Also Read :Confirm Train Ticket: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ట్రైన్‌లో సీటు పొందండిలా..!
మహారాష్ట్రలోని జల్‌గావ్‌కు చెందిన యాత్రికులు తొలుత ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేపాల్‌లోని పోఖారాకు చేరుకున్నారు. శుక్రవారం రోజు నేపాల్‌లోని పోఖారా నుంచి రాజధాని ఖాట్మండు వైపు బస్సు వెళ్తుండగా.. మార్గం మధ్యలో తనహున్ జిల్లా ఐనాపహారా వద్ద బస్సు అదుపు తప్పి మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. దాదాపు 150 మీటర్ల ఎత్తు నుంచి నదిలో బస్సు పడటంతో అందులోని 41 మంది చనిపోయారు.