NASA: అహ్యూమన్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ కోసం ఢిల్లీ మరియు ముంబైకి చెందిన భారతీయ విద్యార్థుల(Indian students) బృందాలు నాసా(NASA)నుండి అవార్డులను గెలుచుకున్నాయి. అలబామా రాష్ట్రంలోని హంట్స్ విల్లేలో ఉన్న అమెరికా అంతరిక్ష రాకెట్ కేంద్రంలో ఈ నెల 19, 20 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఢిల్లీకి చెందిన కేఐఈటీ గ్రూప్ విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్స్ క్రాష్ అండ్ బర్న్ విభాగంలో అవార్డును గెలుచుకున్నట్లు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) సోమవారం ప్రకటించింది. అలాగే ముంబైకి చెందిన ద కనాకియా ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు రూకీ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు.
Read Also: Hanuman Jayanti : కొండగట్టుకు పోటెత్తిన హనుమాన్ భక్తులు
కాగా , ఈ పోటీలో అమెరికాలోని డాలస్‌కు చెందిన పారిష్ ఎపిస్కోపల్ స్కూల్ హైస్కూల్ విభాగంలో తొలి బహుమతి సాధించింది. అలాగే కాలేజీ, యూనివర్సిటీ విభాగంలో హంట్స్ విల్లేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అలబామా ప్రథమ బహుమతిని గెల్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా 600 మందికిపైగా విద్యార్థులతో కూడిన 72 టీమ్స్ ఈ వార్షిక పోటీలో పాల్గొన్నాయి. అమెరికాలోని 24 రాష్ట్రాలతోపాటు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, ప్యూర్టోరికో, భారత్ సహా మరో 13 దేశాల నుంచి 42 కాలేజీలు, యూనివర్సిటీలు, 30 హైస్కూళ్ల విద్యార్థులు ఈ పోటీలో తన ప్రతిభను చాటారు.
Read Also: Quiet Firing: క్వైట్ ఫైరింగ్ అంటే ఏమిటో తెలుసా..? ఉద్యోగాలలో ఇదొక కొత్త ట్రెండ్!
మరోవైపు “ఈ స్టూడెంట్ డిజైన్ ఛాలెంజ్ వినూత్న భావనలు మరియు ప్రత్యేకమైన దృక్కోణాలను తరువాతి తరం శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్‌లను ప్రోత్సహిస్తుంది” అని నాసాకు చెందిన వెమిత్రా అలెగ్జాండర్ అభిప్రాయపడ్డారు.