Site icon HashtagU Telugu

Ticket Cancellation : కొత్త క్యాన్సిలేషన్ విధానాన్ని తీసుకొచ్చిన ఇండియన్ రైల్వే

Train Ticket Cancellation

Train Ticket Cancellation

ఇండియన్ రైల్వే (Indian Railways) టికెట్ రద్దు విధానంలో కీలక మార్పులు చేసింది. రైల్వే టికెట్ కౌంటర్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్లను ఇకపై IRCTC వెబ్‌సైట్ లేదా 139 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా క్యాన్సిల్ (Cancellation )చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మార్పుతో ప్రయాణికులు ఇకపై స్టేషన్లకు వెళ్లే అవసరం లేకుండా ఆన్లైన్‌లోనే టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnav) తెలిపారు.

Instagram : ఇంస్టాగ్రామ్ లో సరికొత్త ఫీచర్..స్టేటస్‌ ప్రియులకు పండగే

కొత్త విధానం ప్రకారం, కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్ కోసం ప్రయాణికులు IRCTC వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి లేదా 139 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి వివరాలను అందించాలి. క్యాన్సిలేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, రీఫండ్ కోసం ప్రయాణికులు టికెట్ కొనుగోలు చేసిన కౌంటర్ వద్దకు వెళ్లాలి. అంటే, టికెట్ రద్దు ఆన్లైన్‌లో చేసినప్పటికీ, రీఫండ్ పొందడానికి ప్రయాణికులు కౌంటర్‌కే వెళ్లాలి.

MAD Square : ‘మ్యాడ్ స్క్వేర్’ ఫస్ట్ డే కలెక్షన్స్

ఈ కొత్త విధానం ప్రయాణికులకు మరింత సౌలభ్యంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే స్టేషన్లలో కౌంటర్ల వద్ద క్యాన్సిలేషన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం తగ్గుతుంది. అయితే, రీఫండ్ కోసం కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన నిబంధన యథాతథంగా కొనసాగుతుండటంతో, ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అయినప్పటికీ, ఆన్లైన్ ద్వారా క్యాన్సిలేషన్ సౌకర్యం అందుబాటులోకి రావడం భారతీయ రైల్వేలో మరో ముందడుగు అని చెప్పొచ్చు.