Site icon HashtagU Telugu

Firoz Merchant : 900 మంది ఖైదీలను విడిపించిన ఒకే ఒక్కడు

Firoz Merchant

Firoz Merchant

Firoz Merchant : చిన్నపాటి తప్పులు చేసినందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని జైళ్లలో ఎంతోమంది ఖైదీలు మగ్గుతుంటారు. విడిపించేందుకు ఎవరూ ముందుకు రాక.. చాలామంది అలాంటి ఖైదీలు శిక్షా కాలాన్ని పూర్తి చేయాల్సి వస్తుంటుంది. ఇలాంటి ఖైదీలకు ఆత్మబంధువులా సాయం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. పిలవకుండానే పలికే ఒక మనసున్న మనిషి ఉన్నాడు.ఆయనే యూఏఈలోని భారతీయ వ్యాపారవేత్త 66 ఏండ్ల ఫిరోజ్‌ మర్చంట్‌. ఆయన చాలా ఏళ్లుగా ఏటా పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జరిమానాలు కట్టి మరీ వందలాది మంది ఖైదీలను జైళ్ల నుంచి విడిపించారు. ఇంకొన్ని వారాల్లో పవిత్ర రంజాన్ మాసం మొదలవుతుంది. ఈనేపథ్యంలో మరోసారి ఫిరోజ్ మర్చంట్ తన గొప్ప మనసును చాటుకున్నారు. యూఏఈ ప్రభుత్వానికి అక్షరాలా రూ.2.25 కోట్లు చెల్లించి మరీ వివిధ జైళ్లలో మగ్గుతున్న 900 మంది ఖైదీలను విడిపించారు.

We’re now on WhatsApp. Click to Join

ఫిరోజ్‌ మర్చంట్‌ (Firoz Merchant) ప్యూర్‌ గోల్డ్‌ జువెల్లర్స్‌ అనే కంపెనీ యజమాని. 2008లో ఈయన ‘ది ఫర్‌గాటెన్‌ సొసైటీ’ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా 2024 సంవత్సరంలో ఇప్పటి దాకా యూఏఈలోని 900 మంది ఖైదీలను ఫిరోజ్‌మర్చంట్‌ రిలీజ్ చేయించారు. ఆయా ఖైదీలు తమతమ దేశాలకు తిరిగి వెళ్లటానికి అవసరమైన రవాణా ఛార్జీలను కూడా ఆయనే భరించారు. ఈ ఏడాది మొత్తం 3వేల మంది ఖైదీలను విడిపించాలని ఫిరోజ్‌ మర్చంట్‌ టార్గెట్‌గా పెట్టుకున్నారట.

Also Read : Ap : స్పీకర్ తమ్మినేని సంచలన నిర్ణయం – 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు