India Vs Pakistan : రక్షణశాఖ కార్యదర్శితో మోడీ భేటీ.. రేపో,మాపో పీఓకేపై దాడి ?

పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీరు(పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై దాడికి జరుగుతున్న సైనిక ఏర్పాట్లపై సమీక్షించేందుకే మోడీ(India Vs Pakistan) ఈ వరుస సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Indian Defense Secretary Prime Minister Narendra Modi India Vs Pakistan Pm Modi

India Vs Pakistan : ఆదివారం రోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భారత వాయుసేన చీఫ్ అమర్‌ప్రీత్‌ సింగ్ భేటీ కాగా, ఇవాళ  ఆయనతో రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ సమావేశమయ్యారు. అంతకుముందు శనివారం రోజు భారత నేవీ చీఫ్ దినేష్‌ కె.త్రిపాఠితో, ఏప్రిల్ 30న భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో మోడీ భేటీ అయ్యారు. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీరు(పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై దాడికి జరుగుతున్న సైనిక ఏర్పాట్లపై సమీక్షించేందుకే మోడీ(India Vs Pakistan) ఈ వరుస సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

సమావేశాల్లో చర్చిస్తున్న అంశాలివే.. 

పీఓకేను ఎలా చుట్టుముట్టాలి ? ఉగ్రవాద స్థావరాలపై ఎలా దాడి చేయాలి ? ఈ దాడి క్రమంలో త్రివిధ దళాలు ఎలా సమన్వయం చేసుకోవాలి ?  దాడి తర్వాత పాకిస్తాన్ ఎలా స్పందిస్తుంది ? ప్రతిస్పందనగా పాకిస్తాన్ చేసే దాడిని ఎలా నిలువరించాలి ? భారత్‌పై పాకిస్తాన్ ప్రతిదాడి చేసే క్రమంలో.. త్రివిధ దళాలు పాకిస్తాన్ ఆర్మీపై ఒత్తిడిని ఎలా పెంచాలి ? అనే అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.  పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసే విషయంలో స్వేచ్ఛగా పనిచేసేందుకు ఇప్పటికే భారత త్రివిధ దళాలకు ప్రధాని మోడీ వెసులుబాటును కల్పించారు. దీనికి అనుగుణంగా త్రివిధ దళాలు తమదైన శైలిలో ప్రణాళికలను రెడీ చేసుకుంటున్నాయి. ప్రధాని మోడీతో సమావేశాల వేళ ఈ ప్రణాళికలను వివరిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read :Prakash Raj : భయంలో బాలీవుడ్ యాక్టర్స్.. ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

రెండు, మూడు రోజుల్లోనే పీఓకేపై ముప్పేట దాడి ? 

పహల్గాం ఉగ్రదాడికి భారత్ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుందని ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్‌ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. దీంతో పాకిస్తాన్ సైన్యం నిద్రలేని రాత్రులు గడుపుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీరు(పీఓకే)పై భారత్ దాడి చేయడం దాదాపు ఖాయమైంది. దీంతో పాకిస్తాన్‌లోని మదర్సాలను మూసేశారు. ఆయా మదర్సాలలోని విద్యార్థులను మిలిటెంట్లుగా వాడుకునేందుకు పాకిస్తాన్ ఆర్మీ సన్నాహాలు మొదలుపెట్టింది.  పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను కూడా పాక్ ఆర్మీ మూసేసింది. వాటిలో ఇప్పటివరకు ఉన్న ఉగ్రవాదులను సైన్యంలో కలుపుకుంది. తద్వారా భారత ఆర్మీ దాడిని తిప్పికొట్టాలని పాకిస్తాన్ స్కెచ్ గీస్తోంది. ఇదంతా భారత్ ముందే గ్రహించింది. పాకిస్తాన్ ఆర్మీ కదలికలు, నిర్ణయాలపై నిఘా వర్గాల నుంచి భారత్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోంది. దీనికి అనుగుణంగా రాబోయే రెండు, మూడు రోజుల్లోనే పీఓకే‌పై భారత సైన్యం త్రివిధ దళాలతో ముప్పేట దాడి చేస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

Also Read :Hot Bedding : హాట్ బెడ్డింగ్‌తో కాసుల వర్షం.. యువతి వినూత్న వ్యాపారం

  Last Updated: 05 May 2025, 02:08 PM IST