Shubhanshu Shukla : ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) లో 18 రోజుల ప్రయోగాత్మక ప్రయాణాన్ని ముగించిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా భూమికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. అమెరికా ప్రైవేట్ స్పేస్ ఎజెన్సీ ఆక్జియం స్పేస్ నిర్వహిస్తున్న ఆక్జియం-4 మిషన్ లో భాగంగా శుక్లా మొదటిసారి అంతరిక్ష యాత్రకు ఎంపికయ్యారు.
ఈ మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా మరో ముగ్గురు అంతరిక్షయాత్రికులతో కలిసి ప్రయాణించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4.15 గంటల నుంచి ఐఎస్‌ఎస్ నుంచి విడిపోవడానికి డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ సిద్ధంగా ఉంచారు. సాంకేతిక సమయాలలో కొన్ని ఆలస్యం వచ్చినప్పటికీ, ఎలాంటి అవాంతరాలు లేకుండానే స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా అన్‌డాక్ అయ్యింది.
అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న శుభాంశు శుక్లా తమ మిషన్‌ను సురక్షితంగా ముగించి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రయాణంలో నలుగురు వ్యోమగాములతో పాటు సుమారు 250 కిలోగ్రాముల ప్రయోగ పరికరాలు, పరిశోధనలలో ఉపయోగించిన కార్గోను కూడా భూమికి తీసుకువస్తున్నారు.
ఈ 18 రోజుల కాలంలో శుభాంశు శుక్లా ISS లో పలు ప్రయోగాలు, సాంకేతిక పరిశోధనల్లో పాల్గొన్నారు. భారత అంతరిక్ష రంగానికి ఇది మరొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది. ఈ అనుభవం ద్వారా భారత శాస్త్రవేత్తలకు అంతరిక్ష ప్రయోగాలపై మరింత లోతైన అవగాహన ఏర్పడే అవకాశం ఉంది.
శుభాంశు శుక్లా విజయవంతమైన మిషన్ ప్రయాణం భారత అంతరిక్ష పరిశోధనలో కొత్త అవకాశాలను తెరలేపుతుంది. ఇక ఫ్లోరిడా తీరానికి సమీపంగా స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండింగ్ జరిగే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు, అంతరిక్ష ప్రియులు ఈ ప్రయాణంపై భారీ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.
Al Bukhara fruits : ఆరోగ్య సంజీవని అల్ బుకర్ పండు.. పుష్కలంగా ప్రోటీన్లు, విటమిన్లు