Indian Robots : భూకంపంతో అల్లాడిపోయిన మయన్మార్‌కు భారత్ అన్నివిధాలా సహాయ సహకారాలను అందిస్తోంది. భూకంపం ధాటికి అక్కడ ఎన్నో ఇళ్లు కూలిపోయాయి. మయన్మార్‌లోని సైనిక పాలకులు ఆధిపత్యం సాధించడంపై ఫోకస్ పెట్టారే తప్ప.. ఇలాంటి భూకంపాలు వస్తే ఏం చేయాలనే దానిపై అస్సలు ఫోకస్ పెట్టలేదు. అందువల్లే మయన్మార్ దేశం వద్ద సరైన విపత్తు నిర్వహణ వ్యవస్థ లేదు. అందుకు అవసరమైన సామగ్రి కానీ, నిపుణులైన మానవ వనరులు కానీ లేవు. దీంతో సహాయక చర్యల కోసం భారత దళాలు, సహాయక సిబ్బందిపై ఆధారపడుతోంది. ఈక్రమంలోనే మయన్మార్‌లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం రోబోలను, డ్రోన్లను భారత సైన్యం పంపింది.
Also Read :Tahawwur Ranas Lawyer: ఉగ్రవాది తహవ్వుర్ రాణా తరఫు న్యాయవాది ఎవరు?
శిథిలాల్లో డెడ్‌బాడీలు ఉంటే..
‘ఆపరేషన్ బ్రహ్మ (Operation Brahma)’ ద్వారా మయన్మార్‌కు భారత్ చాలా సహాయాన్నే అందిస్తోంది. ప్రత్యేకించి ఆ దేశంలోని మాండలే, నేపిడాలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ డెడ్‌బాడీలు(Indian Robots) బయటపడుతున్నాయి. ఇక్కడి శిథిలాల్లో డెడ్‌బాడీలు ఉంటే గుర్తించడానికి భారత సైన్యానికి చెందిన రోబోలను వాడుతున్నారు. ఇవి శిథిలాలపై తిరుగుతూ.. లోపల మనిషి జాడ ఉంటే వెంటనే అలారం మోగిస్తున్నాయి. సహాయక సిబ్బంది వెళ్లలేని చోటుకు కూడా భారత ఆర్మీ రోబోలు చేరుకుంటుండటం పెద్ద అడ్వాంటేజీగా మారింది.
Also Read :Assassination Files: రాబర్ట్ ఎఫ్ కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యల ఫైళ్లు.. ఎలా చంపారు ?
మార్చి 28న భూకంపం.. భారీ ప్రాణ నష్టం
మార్చి 28న సంభవించిన భూకంపం వల్ల మయన్మార్‌లో 3 వేలకుపైగా మరణాలు సంభవించాయి. దీంతో భారత్ ఇప్పటికే 31 టన్నుల సహాయక సామగ్రితో సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానాన్ని మయన్మార్‌కు పంపింది. మాండలేలో భారత ఆర్మీ తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం అందిస్తోంది. భారత నౌకాదళానికి చెందిన ‘ఐఎన్‌ఎస్ ఘరియాల్’ వందల టన్నుల ఆహారాన్ని శనివారం తిలావా ఓడరేవుకు పంపింది. క్వాడ్ దేశాలైన భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్‌లు మయన్మార్‌ను ఆదుకునేందుకు 20 మిలియన్ డాలర్ల మానవతా సాయాన్ని ప్రకటించాయి. మొత్తం 118 మంది సిబ్బంది మయన్మార్‌లో విధులు నిర్వహిస్తున్నారు.