Indian Army : ఇంటర్ పూర్తయిందా ? బీటెక్ ఫ్రీగా చేయాలని అనుకుంటున్నారా ? అయితే ఇది మంచి అవకాశం ! ఇందుకోసం మీరు ఇండియన్ ఆర్మీ 52వ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్‌కు అప్లై చేయాలి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన పరీక్షలో పాసయ్యే వారు ఫ్రీగా ఇంజినీరింగ్ చేయొచ్చు. మిలటరీ ట్రైనింగ్ కూడా పొందొచ్చు. 60 శాతం మార్కులతో ఇంటర్ పూర్తి చేసిన అవివాహిత పురుషులు ఈ పోస్టులకు అర్హులు. ఇంటర్‌లో కచ్చితంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లను చదివి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి. అభ్యర్థుల వయస్సు 16.5 ఏళ్ల నుంచి 19.5 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా 90 పోస్టులకు ఎంపికయ్యే వారికి బీటెక్ కోర్స్‌తో పాటు ఆర్మీ లెఫ్టినెంట్ జాబ్స్ కోసం ఫ్రీగా శిక్షణ అందిస్తారు. ఈ పోస్టులకు ఎంపిక కావడం అంత సులభమేం కాదు. స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షల్లో పాస్ కావాలి. తదుపరిగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వీటన్నింటిలోనూ క్వాలిఫై అయితేనే అభ్యర్థులను టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సుకు ఎంపిక చేస్తారు.
We’re now on WhatsApp. Click to Join
ఐదేళ్లు ట్రైనింగ్.. ఇంజినీరింగ్ పట్టా
- ఇండియన్ ఆర్మీ (Indian Army) టెక్నికల్ ఎంట్రీ స్కీమ్‌కు ఎంపికయ్యే వారికి ఐదేళ్ల పాటు ట్రైనింగ్ ఉంటుంది.
- ఇందులో ఏడాది పాటు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఇస్తారు. మిగతా నాలుగేళ్లు టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుంది.
- కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్) అందిస్తారు.
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ జూన్ 13.
Also Read :Bibhav Kumar Arrest : స్వాతి మలివాల్‌పై దాడి.. కేజ్రీవాల్ మాజీ పీఎస్ బిభవ్ అరెస్ట్
- ఇండియన్ నేవీ అగ్నివీర్ మెట్రిక్ రిక్రూట్ (ఎంఆర్), సీనియర్ సెకండరీ రిక్రూట్ (ఎస్‌ఎస్‌ఆర్) నోటిఫికేషన్లను ఇటీవల విడుదల చేసింది. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్హతలతో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
- ఈ రెండు రకాల పోస్టులకు మహిళలు కూడా అర్హులే.
- అభ్యర్థులకు తొలుత రెండు దశల్లో రాత పరీక్షలు నిర్వహిస్తారు. తరువాత ఫిజికల్, మెడికల్ టెస్ట్‌లు నిర్వహించి అగ్నివీర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
- ఎంపికయ్యే వారు నాలుగేళ్లు అగ్నివీరులుగా సేవలు అందించాలి.
- అగ్నివీర్‌గా ఎంపికైన ప్రతి నలుగురిలో ఒకరికి మాత్రం శాశ్వత ఉద్యోగ అవకాశం దక్కుతుంది.