Site icon HashtagU Telugu

Miss India USA – 2023 : రిజుల్ మైనీకి ‘మిస్ ఇండియా యూఎస్ఏ‌’ కిరీటం

Miss India Usa 2023

Miss India Usa 2023

Miss India USA – 2023 : ‘‘మిస్ ఇండియా యూఎస్ఏ – 2023’’గా భారత సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థి రిజుల్ మైనీ(Rijul Maini) నిలిచారు. న్యూజెర్సీలో జరిగిన ‘‘మిస్ ఇండియా యూఎస్ఏ – 2023’’ అందాల పోటీలో గెలవడం ద్వారా 24 ఏళ్ల రిజుల్ వార్తల్లోకి ఎక్కారు. ఈ పోటీల్లో అమెరికాలోని 25 కంటే ఎక్కువ రాష్ట్రాల నుంచి 57 మంది పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్నవారంతా భారత సంతతికి చెందిన అమెరికన్ పౌరులే. మిస్ ఇండియా యూఎస్ఏ -2023 టైటిల్‌ను గెలుచుకున్నందుకు సంతోషంగా ఉందని రిజుల్ అన్నారు. తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. మిచిగాన్‌ ప్రాంతంలో నివసించే రిజుల్ మైనీ ప్రస్తుతం మెడిసిన్ చేస్తోంది.  గొప్ప సర్జన్ కావాలనేది తన లక్ష్యమని రిజుల్ చెప్పింది. ఈ పోటీలలో వర్జీనియాకు చెందిన గ్రీష్మా భట్ ఫస్ట్ రన్నరప్‌గా, నార్త్ కరోలినాకు చెందిన ఇషితా పైరాయ్కర్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.

We’re now on WhatsApp. Click to Join.

మిస్ ఇండియా USA, మిసెస్ ఇండియా USA, మిస్ టీన్ ఇండియా USA అనే మూడు వేర్వేరు విభాగాల్లో ఈ  పోటీలు జరిగాయి. ఈ మూడు కేటగిరీల విజేతలు .. తదుపరిగా జరిగే  ‘‘మిస్- మిసెస్-టీన్ ఇండియా వరల్డ్‌వైడ్‌’’ పోటీల్లో(Miss India USA – 2023) పాల్గొనడానికి కాంప్లిమెంటరీ ఎయిర్ టికెట్‌లను పొందుతారు. అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన స్నేహ నంబియార్‌ ‘‘మిసెస్ ఇండియా యూఎస్ఏ’’గా నిలిచారు. పెన్సిల్వేనియాకు చెందిన సలోని రామ్మోహన్ ‘‘మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ’’ టైటిల్‌ను గెల్చుకున్నారు. ‘వరల్డ్‌వైడ్ పేజెంట్స్’ బ్యానర్‌పై న్యూయార్క్‌కు చెందిన భారతీయ అమెరికన్లు ధర్మాత్మ, నీలం శరణ్ ఈ పోటీలను నిర్వహించారు.