చైనా షాంఘైలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉగ్రవాదంపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం అందించే దేశాలు, సంస్థలు, వ్యక్తులను కూడా ఆ తీవ్ర చర్యలకు బాధ్యులుగా పరిగణించాలని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని పాలసీలా చేసుకుని ప్రోత్సహించే దేశాలు దాని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజ్నాథ్ నిశితంగా వ్యాఖ్యానించారు.
Jagga Reddy : చివరకు పెళ్లాంమొగుళ్ల మాటలు కూడా రికార్డు చేశారు కొడుకులు
రాజ్నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్‌ను ఉద్దేశించి చేసినవేనన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. సరిహద్దులపై, కాశ్మీర్‌లో తరచూ భారత్‌పై పాక్ మద్దతుతో ఉగ్రదాడులు జరగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిపై SCO జాయింట్ స్టేట్మెంట్లో స్పష్టమైన ప్రస్తావన లేకపోవడంతో, ఆ డాక్యుమెంటుపై సంతకం చేయడానికి భారత్ నిరాకరించింది. ఉగ్రదాడుల విషయంలో సహనంతో కాక, కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రాజ్నాథ్ పరోక్షంగా తెలిపారు.
రాజ్నాథ్ వ్యాఖ్యలు SCO వేదికపై భారత్ ఘనంగా తన వైఖరిని ఉద్ఘాటించిన ఉదాహరణగా నిలిచాయి. ఉగ్రవాదాన్ని సహించే, ప్రోత్సహించే యాజమాన్యాలపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచే దిశగా ఇది ముందడుగు కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు గట్టి చర్యలు తీసుకోవాలని భారత్ సందేశమిచ్చినట్టైంది.