Site icon HashtagU Telugu

India-US Trade Deal: భార‌త్‌పై ట్రంప్ 25 శాతం టారిఫ్‌.. ప్రధాన కార‌ణాలివే!

India-US Trade Deal

India-US Trade Deal

India-US Trade Deal: డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25% టారిఫ్‌ను (India-US Trade Deal) ఆగస్టు 1 నుండి అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా ఆయన కొన్ని అంశాలను పేర్కొన్నారు.

ట్రంప్ ప్రకటనలోని ముఖ్యాంశాలు

ఇతర వ్యాఖ్యలు

ట్రంప్ ప్రధాని మోదీని తన మంచి స్నేహితుడిగా అభివర్ణించారు. తన విజ్ఞప్తి మేరకు భారత్ పాకిస్తాన్‌తో ‘యుద్ధాన్ని’ ముగించిందని, అది చాలా గొప్ప విషయం అని పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌తో కూడా చాలా అద్భుతమైన ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. అంతకుముందు, వాషింగ్టన్‌లో ఒక రోజు ముందు కూడా ట్రంప్ భారత్‌పై భారీ టారిఫ్‌లు విధించవచ్చని సూచించారు.

Also Read: Kingdom : విజయ్ దేవరకొండ ‘కింగ్’ అవుతాడా..? ‘డమ్’ అంటాడా..?

తదుపరి చర్చలు

భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం అమెరికన్ బృందం ఆగస్టు 25న భారత్‌కు రానుంది. గతంలో ట్రంప్ భారత్‌పై విధించిన 26% టారిఫ్‌లను ఆగస్టు 1 వరకు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రకటించిన 25% టారిఫ్ నిర్ణయం, రాబోయే చర్చలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

ఒక రోజు ముందు వాషింగ్టన్‌లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా భారత్‌పై భారీ టారిఫ్‌లను విధించవచ్చని చెప్పాడు. ఈ విషయంపై అడిగినప్పుడు అతను.. “నాకూ అలాగే అనిపిస్తుంది” అని అన్నాడు. అయితే ట్రంప్ మరోసారి వాణిజ్యం ద్వారా భారత్- పాకిస్తాన్ మధ్య సంఘర్షణను ఆపినట్లు పునరుద్ఘాటించాడు. ప్రధాని మోదీని తన మంచి స్నేహితుడిగా పేర్కొంటూ ట్రంప్ ఇలా అన్నాడు. “వారు నా అభ్యర్థన మేరకు పాకిస్తాన్‌తో ‘యుద్ధాన్ని’ ముగించారు. అది చాలా గొప్ప విషయం. పాకిస్తాన్ కూడా… మేము చాలా, చాలా అద్భుతమైన ఒప్పందాలు చేశాము, వాటిలో ఇటీవల కంబోడియాతో జరిగిన ఒప్పందం కూడా ఉంది” అని పేర్కొన్నారు.