Target PoK : జమ్మూకశ్మీరులోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత సైన్యం పూర్తి ఫోకస్‌ను పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)పై పెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగైనా పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని భారత్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేకించి పీఓకేలోని కర్నా, కేరన్, మాచిల్ సెక్టార్లలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఆయా సెక్టార్లకు సమీపంలోని ప్రాంతాలకు వెళ్లొద్దని జమ్మూకశ్మీరు ప్రజలకు భారత సైన్యం అడ్వైజరీ జారీ చేసిందని అంటున్నారు. పీఓకేపై ఆపరేషన్ చేపట్టనున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కశ్మీర్‌వ్యాప్తంగా ఉన్న 87 టూరిస్టు కేంద్రాల్లో 48 కేంద్రాలను భారత సర్కారు మూసివేయించింది. కశ్మీర్‌లోని గుల్మార్గ్, సోనామార్గ్ దాల్ లేక్ ప్రాంతాలతో సహా పలు సున్నితమైన పర్యాటక ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులను మోహరించారు.
Target PoK : పీఓకేపైనే భారత్ గురి.. ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లే లక్ష్యం
