Site icon HashtagU Telugu

India – Pakistan War : పాక్ స్థావరాలపై భారత్ మెరుపు దాడులు – 30 మంది ఉగ్రవాదులు మృతి

Operation Sindhur

Operation Sindhur

పహల్గామ్ దాడి(Pahalgam Attack)కి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) పేరిట వైమానిక దాడులు చేసినట్లు భారత రక్షణ శాఖ ప్రకటించింది. పాకిస్థాన్తో పాటు POK(POK In Response)లోని 9 ప్లేస్లను గుర్తించి నాశనం చేసినట్లు పేర్కొంది. అటు POKలోని కోట్లి, ముజఫరాబాద్, బహవల్పూర్లో భారత ఆర్మీ దాడులు(Indian Army Attacks) చేసిందని పాకిస్థాన్ ఆర్మీ ధ్రువీకరించింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ఈ దాడి జరిగింది ఈ దాడుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశారు.

ఉగ్రవాద స్థారవాలపై భారత్ మెరుపుదాడులతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. పాక్ సైన్యం కాల్పులను భారత్ తిప్పికొడుతోంది. అటు, పాక్ ఇస్లామాబాద్, రావల్పిండిలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి.. వైద్య అధికారులకు సెలవులను రద్దుచేసింది. పాకిస్థాన్ పంజాబ్‌లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. భారత సైన్యం మెరుపు దాడితో పాకిస్థాన్ ప్రతీకారానికి పాల్పడుతోంది. భారత సరిహద్దుల్లోని గ్రామాలతో మోటార్ షెల్స్‌తో పౌరులే లక్ష్యంగా ప్రయోగించింది. నివాస సముదాయాలపై జరిగిన ఈ దాడిలో ముగ్గురు పౌరులు మృతిచెందారు. బహవల్పూర్ ని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ హెడ్ క్వార్టర్, జైషే మహమ్మద్కు చెందిన మదర్సాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ మెరుపు దాడి చేసింది. దీంతో అక్కడ 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఇదే విషయాన్ని పాక్ మీడియాలో ధ్రువీకరించినట్లు తెలుస్తోంది.

India’s first Quantum Valley in Amaravati : అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు

ఇటు తమ దేశంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేయడంపై పాక్ షాక్ అయింది. వెంటనే LoC వద్ద భారత్ వైపు కాల్పులు మొదలుపెట్టింది. నిన్నటివరకు చిన్నచిన్న ఆయుధాలతో ఫైరింగ్ చేసిన ఆ దేశ సైన్యం తాజాగా యుద్ధ ట్యాంకులను మోహరించింది. దీన్ని సమర్థంగా తిప్పికొడుతున్న భారత సైన్యం సరిహద్దుల్లో వైమానిక రక్షణ విభాగాలను సన్నద్ధం చేసింది. మన గగనతలంలోకి శత్రుదేశ మిస్సైల్స్ వస్తే వెంటనే కూల్చేయడానికి సిద్ధమైంది.