Site icon HashtagU Telugu

India Vs Pakistan: జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ బార్డర్లలో హైటెన్షన్.. పాక్ ఎటాక్స్.. తిప్పికొడుతున్న భారత్

Pakistan Fighter Jets Rajasthan Punjab Jammu Kashmir India Vs Pakistan

India Vs Pakistan: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం తీవ్రరూపు దాల్చింది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ ఆత్మాహుతి డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు దిగింది. జమ్మూలోని సత్వారీ, సాంబా, ఆర్‌ఎస్‌ పురా, ఆర్నియా సెక్టార్లు లక్ష్యంగా పాకిస్తాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. వీటిలో ఎనిమిది మిసైల్స్‌ను భారత సైన్యం కూల్చేసింది. దీంతో జమ్మూలోని ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  జమ్మూ, కుప్వారా, అఖ్నూర్‌, కిష్త్వార్‌, సాంబా సెక్టార్‌లో అధికారులు పూర్తిగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.  జమ్మూకశ్మీరులోని ఉరి, సాంబా సెక్టార్‌ వైపుగా పాకిస్తాన్ రేంజర్లు విచక్షణారహిత కాల్పులు జరుపుతున్నారు. జమ్మూకశ్మీరులోని రాజౌరీలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాకిస్తాన్ సూసైడ్ డ్రోన్లు, రాకెట్ల దాడి వల్లే ఆ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. మొత్తంగా జమ్మూ పరిధిలో ఇవాళ సాయంత్రం నుంచి ఇప్పటివరకు ఏడుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పలుచోట్ల పాక్‌ డ్రోన్లను భారత సైన్యం కూల్చేసింది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో రెండు డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది. జమ్మూ సహా పఠాన్‌కోట్‌, ఉధమ్‌పుర్‌లలో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం.

Also Read :ED Vs Lalu : త్వరలో పోల్స్.. లాలూ‌పై ఈడీ విచారణకు గ్రీన్ సిగ్నల్

Also Read :Pakistan Attack : అర్ధరాత్రి వేళ దాడికి పాక్ యత్నం.. బలంగా తిప్పికొట్టాం : భారత్