ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా భారత్ (India) మరోసారి తన వాయు రక్షణ సామర్థ్యాన్ని (Air Defense Capability) ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ మిషన్‌లో భారత వాయుసేన అద్భుతంగా స్పందించి పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. డిజిఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ (DGMO Lieutenant General Rajiv Ghai) వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్ ముందుగానే తన వాయు రక్షణ వ్యవస్థలను సిద్ధం చేసుకొని పాకిస్తాన్ డ్రోన్ దాడులను లేజర్ గన్‌లతో అడ్డుకుంది. పాక్ చేసిన అన్ని దాడులా విఫలమయ్యాయని, మన రక్షణ వ్యవస్థ అనుక్షణం అప్రమత్తంగా ఉందని తెలిపారు.
Pakistan Map : కశ్మీరును పాక్‌లో కలిపేసేలా మ్యాప్.. చిన్న పొరపాటే అంటున్న డీకే
వాయు దళం మిషన్ డైరెక్టర్ జనరల్ అవధేష్ కుమార్ భారతి (Awadhesh Kumar Bharti) మాట్లాడుతూ.. భారత రక్షణ వ్యవస్థ ఎంత అధునాతనంగా మారిందో పాకిస్తాన్ తన పీఎల్-15ఈ క్షిపణులతో చేసిన దాడిని అడ్డుకున్న తీరు తెలుపుతుందని అన్నారు. భారత్ నుంచి జరిపిన క్షిపణి దాడితో పాకిస్తాన్‌లోని రహీమ్ యార్ ఖాన్ ఎయిర్‌బేస్ ధ్వంసమైంది. అలాగే, నూర్ యార్, రహీమ్ యార్ ఖాన్ వంటి ప్రధాన వైమానిక స్థావరాలను భారత దళాలు పూర్తిగా నాశనం చేశాయని తెలిపారు. ఈ చర్యలతో పాక్ మానసికంగా కుదేలైంది.
Manoj Naravane : యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు.. తీవ్రమైన అంశం: ఆర్మీ మాజీ చీఫ్
మరి ముఖ్యంగా మే 7న జరిగిన దాడులపై స్పష్టత ఇచ్చిన అవధేష్ కుమార్, ఈ దాడులు ఉగ్రవాద స్థావరాలపై మాత్రమేనని తెలిపారు. కానీ పాక్ సైన్యం ఉగ్రవాదులకు మద్దతుగా తమ సైనిక శక్తిని వాడింది. దీంతో తాము ఎదుర్కొన్న నష్టాలకు తామే బాధ్యత వహించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఎయిర్ మార్షల్ ఎకె భారతి కూడా భవిష్యత్‌లో అవసరమైతే మరిన్ని మిషన్‌లు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అంటే పరోక్షంగా భారత్ పాక్‌కు గట్టి హెచ్చరికను పంపిందని చెప్పవచ్చు.