Site icon HashtagU Telugu

Digital Payments : ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల్లో భార‌త్‌దే అగ్ర‌స్థానం

India Placed No 1 in Digital Payments MyGovIndia Shared Details

India Placed No 1 in Digital Payments MyGovIndia Shared Details

ప్ర‌పంచ వ్యాప్తంగా డిజిట‌ల్ చెల్లింపుల్లో(Digital Payments) 2022 సంవ‌త్స‌రానికిగాను భార‌త‌దేశం(India) గ్లోబ‌ల్ ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానంలో నిలిచింది. ప్ర‌భుత్వ పౌరుల ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫార‌మ్ MyGovIndia జూన్ 10న వెల్ల‌డించిన డేటాలో పేర్కొంది. దేశంలో 89.5 మిలియ‌న్ల డిజిట‌ల్ లావాదేవీలు జ‌రిగాయి. 2022 సంవ‌త్స‌రంలో ప్ర‌పంచ దేశాల్లో డిజిటిల్ చెల్లింపుల్లో భార‌త‌దేశం వాటా 46శాతంగా MyGovIndia నివేదిక తెలిపింది. ఈ క్ర‌మంలో డిజిటల్ చెల్లింపుల్లో భార‌త‌దేశం కొత్త మైలురాళ్ల‌ను చూసింద‌ని ఆ నివేద‌క పేర్కొంది.

MyGovIndia నివేదిక ప్ర‌కారం.. డిజిట‌ల్ చెల్లింపుల్లో ఇండియా మొద‌టి స్థానంలో నిల‌వ‌గా.. బెజిల్ 29.2 మిలియ‌న్ల డిజిట‌ల్ లావాదేవీల‌తో రెండో స్థానంలో నిలిచింది. అదేవిధంగా 17.6 మిలియ‌న్ల లావాదేవీల‌తో చైనా మూడో స్థానంలో నిలిచింది. థాయిలాండ్ 16.5 మిలియ‌న్ల లావాదేవీల‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ద‌క్షిణ కొరియా 8 మిలియ‌న్ల లావాదేవీల‌తో త‌రువాతి స్థానంలో నిలిచిన‌ట్లు MyGovIndia నివేదిక వెల్ల‌డించింది.

డిజిట‌ల్ చెల్లింపుల్లో భార‌త‌దేశం ప్ర‌థ‌మ స్థానంలో ఉంద‌ని, ఇది దేశ గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మారుస్తోంద‌ని ప్ర‌ధాని మోదీ ఈ ఏడాది ప్రారంభంలో చెప్పిన విష‌యం తెలిసిందే. డిజిట‌ల్ చెల్లింపుల్లో భార‌త‌దేశం తొలి స్థానంలో ఉంది. అదేవిధంగా మొబైల్ డేటా అత్యంత చౌక‌గా ల‌భించే దేశాల్లో భార‌త‌దేశం ఒక‌టని ప్ర‌ధాని తెలిపారు. ప్రధాని అంచ‌నాల‌ను నిజం చేస్తూ MyGovIndia డేటా ప్ర‌కారం భార‌త‌దేశం ప్ర‌పంచంలోనే డిజిట‌ల్ చెల్లింపుల్లో అగ్ర‌స్థానంలో నిల‌వ‌డం గ‌మ‌నార్హం.

 

Also Read : PM Modi: నరేంద్ర మోడీని ఆకట్టుకున్న జపాన్ రాయబారి ట్వీట్.. ట్వీట్ లో ఏముందో తెలుసా?