Site icon HashtagU Telugu

Earthquake: భారత్‌ మరోసారి సాయం.. మయన్మార్‌కు 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది!

India once again helps.. 80 NDRF personnel to Myanmar!

India once again helps.. 80 NDRF personnel to Myanmar!

Earthquake : మ‌య‌న్మార్‌, థాయ్‌లాండ్‌ల‌ను శుక్ర‌వారం నాడు రెండు భారీ భూకంపాలు కుదిపేసిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌కృతి విప‌త్తు కార‌ణంగా మృతుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. అంతేకాక.. అక్కడి ప్రజల జీవనవిధానం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటివరకు మయన్మార్‌లో 1000 మందికి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి విపత్తుతో అల్లాడిపోతున్న ఆ దేశానికి సాయం చేసేందుకు మరోసారి భారత్‌ ముందుకొచ్చింది. 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని అక్కడికి పంపనుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు వెల్లడించారు. మరికొన్ని గంటల్లో 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అక్కడికి బయలుదేరనున్నారు’’ అని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 4.2 తీవ్రతతో మయన్మార్‌లోని భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: Ticket Cancellation : కొత్త క్యాన్సిలేషన్ విధానాన్ని తీసుకొచ్చిన ఇండియన్ రైల్వే

మయన్మార్‌కు సాయం అందించేందుకు భారత్‌ సిద్ధమైంది. ఈవిషయంపై సమావేశమై చర్చించారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలోనే బాధిత దేశానికి భారత్‌ ఆపన్నహస్తం అందిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్‌ బ్రహ్మ కింద మయన్మార్‌కు 15 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు ఆహార ప్యాకెట్లను అందించింది. భూకంపం కారణంగా వెయ్యి మందికి పైగా చనిపోయారు. మరో 2 వేల మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10వేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ హెచ్చరించింది.

ఈనేపథ్యంలోనే మరోసారి మయన్మార్‌ను ఆదుకునేందుకు సిద్ధమైన భారత్‌.. 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని అక్కడి సహాయక చర్యల్లో భాగం చేయనుంది.అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రి పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్‌ సెక్రటరీ ఆంటోనియో-గుటెరస్‌ వెల్లడించారు. మరోవైపు మయన్మార్‌లోని పరిస్థితిపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ ‘ఎక్స్‌’ వేదికగా ఆందోళన వ్యక్తంచేశారు. మృతులకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. ఈ క్లిష్ట సమయంలో మయన్మార్‌కు భారత్‌ అండగా ఉంటుంది. మానవతా సాయం, సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని తరలించాం. బాధిత దేశానికి మేము అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. మయన్మార్‌ సీనియర్‌ జనరల్‌ మిన్‌ అంగ్‌ హ్లైంగ్‌తో ఈ విషయంపై మాట్లాడాను. అక్కడి పరిస్థితిని భారత్‌ ప్రభుత్వం తెలుసుకుంది. ఈ ఘటనపై విచారం వ్యక్తంచేస్తున్నాం అని ప్రధాని మోడీ అన్నారు.

Read Also:  Vallabhaneni Vamsi : ఒక రోజు పోలీస్‌ కస్టడీకి వల్లభనేని వంశీ