Punjab : పంజాబ్‌లోని 13 స్థానాలకుగానూ బీజేపీ 4 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఇక ఇండియా కూటమి 6 స్థానాల్లో లీడ్‌లో ఉంది. చండీగఢ్ లోక్‌సభ స్థానంలో ఇండియా కూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది. హర్యానాలోని 10 స్థానాలకుగానూ 4 చోట్ల బీజేపీ, 6 స్థానాల్లో ఇండియా కూటమి ముందంజలో ఉంది.
We’re now on WhatsApp. Click to Join
జలంధర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సుమారు 16,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి ఆప్ అభ్యర్థి మల్వీందర్ కాంగ్ 3,000 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని మొత్తం ఐదు స్థానాల్లో, హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
Also Read : TDP: కోనసీమలో టీటీపీ క్లీన్ స్వీప్.. వైసీపీ మంత్రుల తిరోగమన బాట
అమృతపాల్ సింగ్ ఖలిస్తానీ వేర్పాటువాది. ఇతడు ప్రస్తుతం అసోంలోని డిబ్రూఘర్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. పంజాబ్‌లోని ఖాదూర్ సాహిబ్ స్థానం నుంచి ఇతడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ప్రస్తుతం అమృతపాల్ సింగ్ 21,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు. లెక్కింపు ప్రారంభమైన మొదట్లో అమృతపాల్ సింగ్ 7,333 ఓట్ల తేడాతో అధిక్యంలో ఉండగా, తరువాతి రౌండ్లలో మరింతగా దూసుకుపోయాడు. అతను కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జిరా, SAD అభ్యర్థి విర్సా సింగ్ వాల్తోహా కంటే ముందంజలో కొనసాగుతున్నాడు.