Site icon HashtagU Telugu

Indian Soldiers : లెబనాన్‌ బార్డర్‌లో 600 మంది భారత సైనికులు.. వాట్స్ నెక్ట్స్ ?

Israel Vs Lebanon 600 Indian Soldiers

Indian Soldiers : లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే వందలాది మంది సామాన్య లెబనాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు లెబనాన్‌ భూభాగంలోకి ఇజ్రాయెల్ ఆర్మీ ప్రవేశించి గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. దీంతో ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగొచ్చని, మరణాల సంఖ్య మరింత పెరగొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళం తరఫున ఇజ్రాయెల్‌- లెబనాన్‌ సరిహద్దుల్లో 600 మంది భారతీయ సైనికులను మోహరించారు. ఈ దేశాల బార్డర్‌లో 120 కి.మీ.ల బ్లూలైన్‌ ఉంది. దాని వెంట 600 మంది భారతీయ సైనికులు గస్తీ విధులు నిర్వర్తిస్తున్నారు.

Also Read :Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ షురూ

ఇజ్రాయెల్ – లెబనాన్ యుద్ధం తీవ్రరూపు దాలుస్తున్న ప్రస్తుత తరుణంలో యూఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్‌లోని తమ సైనికుల భద్రతపై భారత్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈవిషయాన్ని సెంటర్‌ ఫర్‌ జాయింట్‌ వార్‌ఫేర్‌ స్టడీస్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ మేనేజర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. అయితే భారత్ అక్కడి నుంచి తమ సైనికులను హుటాహుటిన వెనక్కి పిలుచుకోలేదు. దీనికి సంబంధించిన తుది నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి  పీస్ కీపింగ్ ఫోర్స్(Indian Soldiers) తీసుకోవాల్సి ఉంటుంది.  ఇజ్రాయెల్‌తో భారత్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయి. అందుకే లెబనాన్ ప్రాంతంలో భారత సైనికుల మోహరింపు అనేది క్లిష్టమైన అంశంగా మారింది. ఇరాన్‌తోనూ భారత్‌కు చాలా మంది సంబంధాలు ఉన్నాయి. లెబనాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థకు ఇరాన్‌ అన్ని రకాల సాయం చేస్తోంది.  అందుకే హిజ్బుల్లాపై పోరాడినా ఇరాన్‌తో భారత్ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇరాన్‌లోని చాబహార్ పోర్టు ప్రాజెక్టు అనేది భారత్‌కు ఎంతో విలువైనది. అది దెబ్బతినకూడదంటే ఇరాన్‌తో మంచి సంబంధాలను కొనసాగించాలి.

Also Read :Rajinikanth: కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్‌‌

వీటన్నింటికి మించి గల్ఫ్‌ ప్రాంతంలోని వివిధ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వారి రక్షణ కూడా మన దేశానికి కీలకం. గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు నిత్యం చమురు దిగుమతి అవుతుంటుంది. మనదేశం నుంచి ఎన్నో ఉత్పత్తులు అరబ్ దేశాలకు వెళ్తుంటాయి. ఈ ప్రయోజనాలన్నీ పరిరక్షించుకునేలా భారత్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వీటిపై యూఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్‌కు సలహా ఇచ్చే ఛాన్స్ ఉంది.