Nuclear Weapons : అణ్వాయుధాల లెక్కలో పాక్‌ను దాటేసిన భారత్

గతంలో భారత్ కంటే పాకిస్తాన్ వద్దే అణ్వాయుధాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆ లెక్క మారింది.

  • Written By:
  • Publish Date - June 18, 2024 / 09:01 AM IST

Nuclear Weapons : గతంలో భారత్ కంటే పాకిస్తాన్ వద్దే అణ్వాయుధాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆ లెక్క మారింది. అణ్వాయుధాల లెక్కలో పాకిస్తాన్‌ను భారత్ దాటేసింది. తాజాగా స్వీడన్ దేశానికి చెందిన స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) సంస్థ విడుదల చేసిన అధ్యయన నివేదికలో ఈ వివరాలను ప్రస్తావించారు.  దీని ప్రకారం.. ఈ ఏడాది జనవరి నాటికి భారత్ వద్ద 172 అణు వార్‌హెడ్‌లు ఉండగా.. పాకిస్తాన్ వద్ద 170 వార్ హెడ్‌లు ఉన్నాయి. భారతదేశం 2023లో అణ్వాయుధాల సంఖ్యను పెంచడంపై ఫోకస్ చేసిందని ఈ లెక్కలను బట్టి స్పష్టమవుతోంది. అణ్వాయుధాలను ప్రయోగించే సరికొత్త పద్ధతులను డెవలప్ చేయడంపై గత సంవత్సరం భారత్, పాకిస్తాన్‌లు ముమ్మరంగా రీసెర్చ్ చేశాయని నివేదిక తెలిపింది. అంటే.. యుద్ధ విమానాలు, మిస్సైళ్లు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో  అణ్వాయుధాలను ప్రయోగించే ఆప్షన్లను మరింత పర్ఫెక్టుగా వినియోగించుకోవడంపై ఈ దేశాలు పనిచేశాయన్న మాట. ఇక భారత్ పొరుగుదేశం చైనా వద్ద 2024 జనవరి నాటికి 500 అణు వార్‌హెడ్‌లు(Nuclear Weapons) ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join

నివేదికలోని కీలక అంశాలివీ.. 

  • ప్రస్తుతం అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్‌, బ్రిటన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి.
  • 2024 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణ్వాయుధాల్లో 90 శాతం అమెరికా, రష్యాల వద్దే ఉన్నాయి.
  • ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల వద్ద 12,121 అణు వార్‌హెడ్‌లు  ఉన్నాయి.
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణు వార్ హెడ్లలో 9,585 వినియోగానికి రెడీగా ఉన్నాయి.

Also Read :Listen To This Page : ఇక గూగుల్ క్రోమ్‌లో చదవొద్దు.. వినేయండి..

  • 9,585  యాక్టివ్ అణు వార్ హెడ్లలో 3,904 వార్‌హెడ్‌లను క్షిపణులు, యుద్ధ విమానాల్లో ఫిక్స్ చేసి రెడీగా ఉంచారు. వీటిలోనూ దాదాపు 2,100 అణు వార్ హెడ్లను బాలిస్టిక్ క్షిపణులలో బిగించి హై అలర్ట్ ఆపరేషన్స్ కోసం సిద్ధంగా పెట్టారు. వీటిలో ఎక్కువ రష్యా లేదా అమెరికాకు చెందినవే అని నివేదిక తెలిపింది.
  •  తొలిసారిగా చైనా కొన్ని వార్‌హెడ్‌లను హై అలర్ట్ ఆపరేషన్స్ కోసం రెడీ చేసిందని నివేదిక చెప్పింది.
  • ఉక్రెయిన్ బార్డర్‌లో రష్యా దాదాపు 36 అణు వార్‌హెడ్‌లను మోహరించిందని సమాచారం.

Also Read : Paneer Fresh: ఫ్రిజ్‌లో ఉంచిన పన్నీరు గట్టిగా మారకుండా ఉండాలంటే చేయండిలా..!