Site icon HashtagU Telugu

PM Modi: ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిగా నిలిచింది: ప్రధాని మోడీ

PM Modi Slept on Train Floor

Narendra Modi Creates new record in America modi visits America soon

ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరి భావ వ్యక్తీకరణకు, సంస్కృతికి తగిన ప్రాధాన్యత ఉంటుందని… అటువంటి విలువలను అనాధిగా కొసాగిస్తూ.. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చారిత్రాత్మక ప్రసంగం చేశారు. అమెరికా దేశంలో ప్రజాస్వామ్యం అతి పురాతనమైనది కాగా.. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని.. ఈ రెండు దేశాల భాగస్వామ్యం ప్రజాస్వామ్య భవిష్యత్తుకు శుభ సూచకమన్నారు.

భారత్ లో రెండు వందల ఐదువేల రాజకీయ పార్టీలుండగా… ఇరవై వేరువేరు పార్టీలు వివిధ రాష్ట్రాలను పాలిస్తున్నాయన్నారు. ప్రపంచంలోని అన్ని విశ్వాసాలకు భారత్ నిలయమన్న ప్రధాని… అన్ని మతాల పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటామన్నారు. గత శతాబ్దంలో, భారతదేశం స్వాతంత్య్రం పొందినప్పుడు, వలస పాలన నుండి తమను తాము విడిపించుకోవడానికి అనేక ఇతర దేశాలను ప్రేరేపించిందన్నఅని అన్నారు ప్రధాని.

ఈ శతాబ్దంలో భారత్ ఆర్ధిక వృద్ధిలో బెంచ్‌మార్క్‌లను నెలకొల్పినప్పుడు, అది అనేక ఇతర దేశాలను అదే విధంగా చేయడానికి ప్రేరేపిస్తుదన్నారు. గతంలో తాను ప్రధాని హోదాలో అమెరికా వచ్చిన సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద 10వ ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత్ … ప్రస్తుతం 5వ స్థానంలో…. త్వరలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని వివరించారు. ప్రధాని ప్రసంగం సందర్భంగా అమెరికా కాంగ్రెస్ సభ్యులు తమ కరాళత ధ్వనులతో పలుసార్లు ఆయనను అభినంధించారు.

Also Read: Ayodhya: అయోధ్యలో రామమందిరం వచ్చే ఏడాదిలో అందుబాటులోకి