General Elections: సార్వత్రిక ఎన్నికల నాల్గొదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ దశంలో తెలంగాణ(Telangana), ఏపి(AP) సహ 10 రాష్ట్రాలు/యూటీల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలిని, ఎన్నికల్లో భారత్ కూటమి గెలస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
నాలుగో దశకు ఓటింగ్ జరుగుతోందని, జూన్ 4న కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మొదటి మూడు దశల నుంచి ఇప్పటికే స్పష్టమైందని రాహుల్ చెప్పారు. “గుర్తుంచుకోండి, మీ ఒక్క ఓటు మీ ప్రజాస్వామ్య హక్కులను కాపాడుతుంది. యువతకు ఏడాదికి లక్ష రూపాయల మొదటి ఉద్యోగానికి ఒక ఓటు సమానం. పేద మహిళల బ్యాంకు ఖాతాలో ఒక ఓటు ఏడాదికి లక్ష రూపాయలకు సమానం” అని ఆయన ఎన్నికల వాగ్దానాలను ఎత్తిచూపారు. ఓటింగ్ గణనీయమైన మార్పులను తీసుకురాగలదని పునరుద్ఘాటించారు.
Read Also: Pithapuram : పిఠాపురంలో భారీగా పోలింగ్..
కాగా, తెలంగాణలోని మొత్తం 17, ఏపీలోని 25 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీలో 13, బీహార్-5, జార్ఖండ్ 4, మధ్యప్రదేశ్-8, మహారాష్ట్ర-11, ఒడిశా-4, పశ్చిమబెంగాల్-8, జమ్ముకశ్మీర్‌లో ఒక్క స్థానం చొప్పున సోమవారం పోలింగ్ జరుగున్నది. ఇక 96 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 1,717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 17.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 8.73 కోట్ల మంది మహిళలు ఉన్నారు.